Suriya : కేరళ కోసం సూర్య ఫ్యామిలీ విరాళం

Suriya : కేరళ కోసం సూర్య ఫ్యామిలీ విరాళం
X

కోలీవుడ్ టాప్ స్టార్స్ గా సూర్య, కార్తీ ఇద్దరూ వెలుగుతున్నారు. ఇద్దరికీ తెలుగులో మార్కెట్ ఉంది. సూర్యకు సౌత్ మొత్తం మార్కెట్ ఉంది. అందుకే వర్షాల ధాటికి కుదేలైపోయిన కేరళలోని వయనాడ్ ప్రాంతం కోసం అన్నదమ్ములిద్దరూ.. ఆ మాటకొస్తే జ్యోతిక కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. ముగ్గురూ కలిసి కేరళ కోసం 50 లక్షల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని వయనాడ్ ప్రాంత బాధితుల కోసం ఖర్చు చేయాలని కోరారు.

కొన్ని రోజుల క్రితం రాత్రిపూట భారీ వర్షాల ధాటికి వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడి ఊళ్లకు ఊళ్లే నామరూపాల్లేకుండా పోయాయి. 200 మంది వరకూ మరణించారు. ఎంతోమంది శిథిలాల కింద నలిగిపోయారు. కేంద్ర బలగాలు వెంటనే సాయం కోసం అక్కడికి వెళ్లాయి. కానీ ఆ ప్రాంతానికి వెళ్లే ఒకే ఒక్క బ్రిడ్జి కూడా కొట్టుపోయింది. దీంతో ఉదృతంగా ప్రవహిస్తోన్న నది నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తాళ్ల సాయంతో నదిని దాటుకుంటూ వెళ్లి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలాంటి విషాద ఘటనకు స్పందించి 50 లక్షల సాయం అందించిన సూర్య, కార్తీ, జ్యోతికలను అభినందించాల్సిందే.

Tags

Next Story