Suriya : కోలీవుడ్ స్టార్ హీరోతో శాండల్ వుడ్ డైరెక్టర్

విక్రమ్, రాకెట్రీ సినిమాలు విడుదలైన 2 సంవత్సరాల తర్వాత , కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) ఈ దసరా పండుగ సీజన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ డ్రామా ‘కంగువ’ ( Kanguva ) తో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది సూర్య కెరీర్ లో 44వ చిత్రం.
తాజా సమాచారం ప్రకారం, సూర్య తన తదుపరి ప్రాజెక్ట్ కోసం శాండల్‌వుడ్ దర్శకుడు నర్తన్ తో చర్చలు జరుపుతున్నాడని టాక్. నర్తన్ ఇటీవల సూర్యకి స్క్రిప్ట్ వినిపించాడని వినికిడి. సూర్య ఇంకా తన ఆమోదాన్ని తెలుపలేదు. ప్రముఖ కన్నడ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ కేవీయన్ ప్రొడక్షన్స్, ప్రస్తుతం యష్ తో టాక్సిక్ మూవీని నిర్మిస్తోంది. సూర్య-నర్తన్ ప్రాజెక్ట్‌ను బహుభాషల్లో విడుదల చేయబోతోంది.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ నటించిన సూపర్‌హిట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మఫ్టీని నర్తనే డైరెక్ట్ చేశాడు. దర్శకుడు ముఫ్టీకి ప్రీక్వెల్ అయిన భైరతి రణగల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా హోల్డ్ లో ఉంది. మరి నిజంగానే సూర్య .. నర్తన్ తో సినిమా చేస్తాడో లేదో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com