Suriya : జురాసిక్ పార్క్ టీమ్ తో సూర్య సినిమా

Suriya :  జురాసిక్ పార్క్ టీమ్ తో సూర్య సినిమా
X

కొన్ని కాంబినేషన్స్ సినిమా అంటే ఆ భాషలోని ప్రేక్షకులంతా అభిమాన హీరోలతో సంబంధం లేకుండా ఎదురుచూస్తారు. తెలుగులో మహేష్ బాబు, రాజమౌళి కాంబో అంటే అందరూ ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అలా అన్నమాట. అయితే అచ్చం ఈ మూవీలాగే తమిళ్ లో అనౌన్స్ అయి ఆగిపోయిన క్రేజీ కాంబినేషన్ ఒకటి ఉంది. మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ లో ఒకడైన సూర్య హీరోగా నేషనల్ అవార్డ్ విన్నర్ వెట్రిమారన్ డైరెక్షన్ లో గతంలోనే ‘వాడి వాసల్’ అనే మూవీ అనౌన్స్ అయింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పారు. ఓపెనింగ్ అయింది. సూర్య ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకూ మూవీ అప్డేట్స్ పెద్దగా లేవు. కట్ చేస్తే వెట్రి మారన్ విడుదలై 1, విడుదలైన 2 తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే విడుదలై 2 విడుదల కాబోతంది. ఇటు సూర్య కంగువాతో బిజీ అయ్యాడు. కంగువా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా లేనట్టే అనే రూమర్స్ స్ట్రాంగ్ గా వచ్చాయి. వాడి వాసల్ ఆగిపోయింది అన్నారు.

కానీ ఈ మూవీ ఆగిపోలేదు. ఈ మేరకు నిర్మాత కలైపులి ఎస్ థాను లేటెస్ట్ గా స్పష్టం చేశాడు. వాడి వాసల్ అనేది జల్లికట్టు సంప్రదాయానికి దగ్గరగా ఉండే మూవీ. ఎద్దుతో పోరాట సన్నివేశాలుంటాయి. అయితే వాటిని గ్రాఫిక్స్ లోనూ, విజువల్ ఎఫెక్ట్స్ లోనూ చూపించాలి కదా. అందుకే జురాసిక్ పార్క్ సినిమా కోసం పనిచేసిన జాన్ లోలన్ టీమ్ తో కలిసి ఆ పనులు ప్రస్తుతం లండన్ లో జరుగుతున్నాయని చెప్పాడు నిర్మాత. సో.. ఈ మూవీ ఉంటుందనే కదా అర్థం.

ఇక మధురై నేపథ్యంలో సాగే ఈ కథ గురించి పక్కన బెడితే గ్రామీణ కథలను వెట్రిమారన్ ఎంత ఇంటెన్సిటీతో చెబుతాడో అందరికీ తెలుసు కదా. అలాంటి కథలో సూర్య లాంటి నటుడు ఉంటే సినిమా రేంజ్ మారుతుంది. అందుకే ఈ కాంబినేషన్ లకోసం ఎంటైర్ కోలీవుడ్ ఈగర్ గా ఎదురుచూస్తోంది.

Tags

Next Story