Suriya : పూరీతో సూర్య.. ఇందులో నిజమెంత..?

కొన్ని వార్తలు అంత ఈజీగా నమ్మాలనిపించదు. అందుకు కారణం అవి అథెంటికేట్ గా ఉండవు. అలాంటిదే ఈ వార్త. తమిళ్ హీరో సూర్య లైనప్ లో పూరీ జగన్నాథ్ మూవీ కూడా ఉండబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. బట్ అవి నమ్మడానికి అంత దగ్గరగా లేవు. అందుకు కారణం పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఉన్న టైమ్ అలాంటిదే. అతను వరుసగా డిజాస్టర్స్ చూస్తున్నాడు. అయినా ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతితో ఓ మూవీ చేస్తున్నాడు. స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్ అనే టైటిల్ తో ఈ మూవీ రూపొందుతోంది. విజయ్ సేతుపతితో పాటు టబు, సంయుక్త, దునియా విజయ్ లు కీలక పాత్రలు చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ సెటప్ లో మాత్రం అదిరిపోయింది. బట్ పూరీ ఎలాంటి కంటెంట్ వస్తున్నాడు అనేదే పాయింట్. పైగా ఆ పాయింట్ కనెక్ట్ అయ్యేదేనా కాదా అనే డౌట్ కూడా ఉంది. కొన్నిసార్లు కథలు విన్నప్పుడు బావుంటుంది. కానీ సినిమాలో మాత్రం నచ్చదు. అలాంటి పాయింట్స్ తోనే పూరీ ఎక్కువగా దెబ్బ తిన్నాడీ మధ్య కాలంలో. అయినా ఈ మూవీ చాలా పెద్ద విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. బట్ సూర్యతో సినిమా అనేదే ప్రస్తుతం రూమర్ గానే వినిపిస్తోంది.
పూరీ లాగానే సూర్య కూడా వరుసగా డిజాస్టర్స్ లో ఉన్నాడు. అయినా అతని చేతిలో నాలుగైదు సినిమాలున్నాయిప్పుడు. సన్నాఫ్ విశ్వనాథమ్ అంటూ ఫస్ట్ టైమ్ తెలుగు మూవీ చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకుడు. నాగవంశీ నిర్మాత. ఈ మూవీ సమ్మర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. దీంతో పాటు కరుప్పు అనే తమిళ్ మూవీ కూడా సమ్మర్ లోనే ప్లాన్ చేస్తున్నారు. ఇవి కాక ఓ తమిళ్ డైరెక్టర్ తో ఓ మళయాల డైరెక్టర్ తో మూవీస్ చేస్తున్నాడు సూర్య. ఇలాంటి టైమ్ లో పూరీ పేరు వినిపించడం కాస్త ఆశ్చర్యమే. అందుకు కారణం పూరీ నిర్మాతగా బాగా నష్టపోయి ఉన్నాడు. అతన్ని నమ్మి కొత్తగా సినిమాలు చేసే నిర్మాతలు కూడా కనిపించడం లేదు. ఆ కారణంగా ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కావడం కుదరదు అనిపించేలా ఉంది. ఒకవేళ అతను స్లమ్ డాగ్ మూవీతో భారీ విజయం సాధిస్తే అప్పుడు మరో మూవీకి రెడీ అవుతాడు. అది సూర్యదేనా లేక మరో హీరోదా అనేది తెలియాల్సి ఉంది. అప్పటి వరకు మాత్రం ఇది ఉట్టి గాసిప్ గానే మిగిలిపోతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
