Suriya: ఆ విషయంలో మెగాస్టార్ నాకు ఇన్‌స్పిరేషన్: సూర్య

Suriya: తమిళ హీరోల్లో సూర్య అంటే కోలీవుడ్ వారికే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చాలా ఇష్టం. అందరు తమిళ హీరోల కంటే ముందుగా తెలుగులో మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు సూర్య. అందుకే తన ప్రతీ సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది. అంతే కాకుండా అందులో చాలావరకు హిట్ టాక్‌ను అందుకుంటాయి కూడా. తాజాగా ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ సూర్య.. ఒక విషయంలో చిరంజీవినే తనకు ఇన్‌స్పిరేషన్ అంటూ బయటపెట్టాడు.
చిరంజీవి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. టాలెంట్‌తో ఎదిగి మెగాస్టార్ అయ్యారు. అందుకే ఆయనంటే చాలామందికి ఇష్టం. అంతే కాకుండా హీరోగా ఎదిగిన తర్వాత ఎన్నో సామాజిక కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఇప్పటికీ ఎవరు కష్టా్ల్లో ఉన్నారని తెలిసిన తనకు తోచిన సాయం చేస్తుంటారు. అయితే చిరంజీవి సేవా గుణం చూసే సూర్య కూడా కావాల్సిన వారికి తనవంతు సాయం చేస్తుంటానని తెలిపాడు.
సూర్య అప్‌కమింగ్ చిత్రం 'ఎత్తర్కుమ్ తునిందవన్' ప్రమోషన్స్ కోసం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చాడు. దానికోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది మూవీ టీమ్. అయితే ఈ ఈవెంట్‌లో సూర్య మాట్లాడుతూ తాను ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి తనకు చిరంజీవినే ఇన్‌స్పిరేషన్ అని అన్నాడు. అంతే కాకుండా కోవిడ్ తర్వాత టాలీవుడ్ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రశంసించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com