Suriya : ఇంట్రెస్టింగ్ .. విలన్ గా సూర్య?

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందేంటంటే..ఓ క్రేజీ ప్రాజెక్టుతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట సూర్య. అయితే హీరోగా కాకుండా విలన్‌గా బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ధూమ్ ఫ్రాంచైజీ నుంచి మూడు సినిమాలు రాగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాలల్లో హీరోల కంటే విలన్‌లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుదన్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌లో జాన్ అబ్రహాం విలన్‌గా నటించగా.. ధూమ్ 2లో హృతిక్ రోషన్ విలన్‌గా నటించి మెప్పించాడు. ఒక థర్డ్ పార్ట్‌లో అయితే బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించి రూ.500 కోట్లకు వసుళ్లను సాధించాడు. తాజాగా ఈ సినిమా పార్ట్ 4 రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ పార్ట్‌లో విలన్‌గా సూర్య నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సూర్య ఇప్పటికే 24 సినిమాతో పాటు ‘విక్రమ్’ చిత్రంలో నెగిటివ్ రోల్ చేసి అలరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com