Suriya : మళయాల దర్శకుడితో సూర్య

Suriya :  మళయాల దర్శకుడితో సూర్య
X

తమిళ్ స్టార్ సూర్య కొన్నాళ్లుగా వరుసగా ఫెయిల్యూర్స్ చూస్తున్నాడు. ప్యాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతుందనుకున్న కంగువా అన్ని భాషల్లోనూ డిజాస్టర్ అయింది. ఈ విషయంలో అతను బాగా డిజప్పాయింట్ అయినట్టు కనిపించాడు. బట్ కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో నటిస్తోన్న రెట్రో మే 1న విడుదల కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోందీ సినిమాలో. ఆ మధ్య వచ్చిన టీజర్ ప్రామిసింగ్ గా కనిపించింది. మరోవైపు వెట్రిమారన్ డైరెక్షన్ లో వాడి వాసలై మూవీ ఉంది. కాకపోతే ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్స్ అయితే రావడం లేదు. కారణాలేంటో తెలియదు కానీ తాజాగా సూర్య ఓ మళయాల డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే వార్త సౌత్ మొత్తం వినిపిస్తోంది.

ఈ మధ్య నూనాక్కుళి, సూక్ష్మదర్శిని అనే చిత్రాలతో నటుడుగానూ ఆకట్టుకున్న బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో సూర్య నటించబోతున్నాడనే న్యూస్ వైరల్ గా మారింది. అందుకు కారణం.. దర్శకుడుగా జోసెఫ్ రూపొందించిన మిన్నల్ మురళి మాలీవుడ్ ఫస్ట్ సూపర్ హీరో మూవీ అనిపించుకుంది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని చెప్పారు. ఆ సీక్వెల్ లోనే మరో సూపర్ హీరోగా సూర్య నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ సౌత్ మొత్తం వైరల్ గా మారింది.

Tags

Next Story