Suriya : సూర్య 44 షూట్ కంప్లీట్

Suriya : సూర్య 44 షూట్ కంప్లీట్
X

తమిళ స్టార్ సూర్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కంగువా. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సరికొత్త కథతో, హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హీరో సూర్య కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూట్ కి గుమ్మడికాయ కొట్టేశారు మేకర్స్. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గ్యాంగ్ స్టార్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేసింది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది విడుదల కానుంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags

Next Story