Kanguva First Single : సూర్య బర్త్ డే గిఫ్ట్.. కంగువా నుంచి కొత్త పాట రిలీజ్..

దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ పదవ తేదీన సూర్య నటిస్తున్న 'కంగువ' చిత్రం ప్రేక్షకుల ముందుకువస్తోంది. సూర్య కెరీర్ లో ఇది ప్రతిష్టాత్మక చిత్రంగా చెప్పుకోవచ్చు. 'కంగువ' చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ సినిమాగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నారు. దిశా పటాని, బాబీ డియోల్ కీలక పాత్రధారులు.
మంగళవారం సూర్య పుట్టినరోజు సందర్భంగా కంగువ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఫైర్ పాటని విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన పాట ఇది. శ్రీమణి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
"అది జ్వాల.. అనంత జ్వాల.. వైర జ్వాల.. వీర జ్వాల.. దైవ జ్వాల.. దావాగ్ని జ్వాల... " అంటూ సాగుతుందీ పాట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రీబ్యూటర్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. పది భాషల్లో రూపొందిస్తున్న కంగువ త్రీ డీలో కూడా విడుదలవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com