Suriya : సూర్య ఫ్యాన్స్ పేషెన్సీకి టెస్ట్

Suriya :  సూర్య ఫ్యాన్స్ పేషెన్సీకి టెస్ట్
X

సౌత్ ఆడియన్స్ కు మోస్ట్ లవబుల్ స్టార్ అంటే ముందు వరుసలో ఉంటాడు సూర్య. ఎంచుకునే సబ్జెక్ట్స్ తో పాటు అతని వ్యక్తిత్వం కూడా ఎక్కువమందిని ఆకట్టుకుంటుంది. గజిని నుంచి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు సూర్య. మంచి మార్కెట్ కూడా ఉందిక్కడ. సూర్య ఫస్ట్ టైమ్ చేసిన ప్యాన్ ఇండియా మూవీ ‘కంగువా’. శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో దిశా పఠానీ హీరోయిన్, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థం అయింది. అసలు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే చాలామంది మస్ట్ వాచ్ లిస్ట్ లో వేసుకున్నారు. అంతలా ఆకట్టుకుంది. టీజర్ తో ఇంప్రెస్ చేసి ట్రైలర్ తో భారీ అంచనాలు పెంచారు. అక్టోబర్ 10న విడుదల అని అనౌన్స్ చేశారు.

అక్టోబర్ 10న ఆల్రెడీ రజినీకాంత్ వేట్టైయాన్ ఉండటంతో తమ చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. రజినీపై గౌరవంతో పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం అని చెప్పారు కానీ.. నిజానికి సూపర్ స్టార్ మూవీనే ముందు అనౌన్స్ చేశారు. తమిళ్ హీరోలు దీపావళి పండగను బాగా సెంటిమెంట్ గా ఫీలవుతారు. దీంతో కంగువను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తారు అని ఎక్స్ పెక్ట్ చేశారు ఫ్యాన్స్. బట్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ ఇప్పటి వరకూ కంగువా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం లేదు. అక్టోబర్ 31న శివ కార్తికేయ్ అమరన్ విడుదలవుతోంది. సూర్య ఆ టైమ్ కు వస్తే శివ కార్తికేయన్ కు షాక్ తప్పదు. అందుకే అతనికీ ఇబ్బంది లేకుండా ఓ కొత్త డేట్ ను చూస్తున్నారని టాక్. అయితే ఆ డేట్ ప్యాన్ ఇండియా రేంజ్ ల ఎవరి సినిమాకూ ఇబ్బంది లేకుండా ఉండాలి. అందుకే కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బట్ ఇది ఫ్యాన్స్ లో అసహనాన్ని పెంచుతోంది. అందుకే తొందరగా ఆ డేటేదో ప్రకటిస్తే వీళ్ల పని వీళ్లు చేసుకుంటారు కదా అంటున్నారు.

Tags

Next Story