Suriya's Retro : ఓటిటిలోకి సూర్య రెట్రో

సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 1న విడుదలైంది. రిలీజ్ కు ముందు రెట్రో పై భారీ అంచనాలున్నాయి. కొన్నాళ్లుగా సూర్య వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ టాలెంటెడ్ అనిపించుకున్నాడు కాబట్టి.. అతను సూర్యకు గ్యారెంటీగా హిట్ ఇస్తాడు అని భావించారు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. దీంతో ఫ్యాన్స్ కూడా మంచి హిట్ రాబోతోందని ఫిక్స్ అయ్యారు. భారీ ఓపెనింగ్స్ తో రిలీజ్ అయిన రెట్రోకు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. దర్శకుడుగా కార్తీక్ సుబ్బరాజ్ ఏ దశలోనూ మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్ హాప్ లో అయితే సెల్వరాఘవన్ రూపొందించిన యుగానికి ఒక్కడు ఫార్మాట్ ను ఫాలో అయ్యాడు. అది సినిమాకు మేజర్ మైనస్ అయింది.
నటన పరంగా సూర్య అదరగొట్టాడు. పూజాహెగ్డే ఫస్ట్ టైమ్ డీ గ్లామర్ రోల్ లో మెప్పించింది. నటనా బావుంది. ఇతర పాత్రలేవీ ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. బలమైన విలన్ ఉన్నా.. అతన్ని క్లైమాక్స్ లో డమ్మీ చేశారు. పైగా ప్రీ క్లైమాక్స్ వరకూ కనిపించిన ఫాదర్ సన్ కాన్ ఫ్లిక్ట్ క్లైమాక్స్ లో తేలిపోవడం.. కొత్త ‘ఫాదర్’ రావడం.. ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకుల మతి పోగొట్టాయి. అందుకే రెట్రో డిజాస్టర్ గా మిగిలింది. అయినా సూర్యకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వారితో పాటు థియేటర్స్ లో చూడని వారు ఓటిటి కోసం చూస్తున్నారు. వారి కోసమే ఈ న్యూస్.
రెట్రో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని జూన్ 5 నుంచి స్ట్రీమ్ చేయబోతున్నారు అంటున్నారు. సో.. నెల దాటగానే ఓటిటిలోకి వచ్చేస్తోందన్నమాట. మరి ఓటిటిలో అయినా రెట్రో కు పాజిటివ్ టాక్ వస్తుందా లేక థియేటర్ టాక్ రిపీట్ అవుతుందా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com