Suriya : సూర్య రెట్రో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మోస్ట్ టాలెంటెడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తోన్న మూవీ ‘రెట్రో’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కార్తీక్ సుబ్బరాజ్ కు మాత్రమే ఇలాంటివి సాధ్యం అవుతాయి అనిపించేలా కట్ చేశాడా టీజర్. ఇక ఇన్నాళ్లుగా చేసిన ప్రయోగాలకు చెక్ పెట్టిన సూర్య కూడా మళ్లీ మాస్ అవతార్ లోకి వచ్చాడు. ముఖ్యంగా టీజర్ లో డైలాగ్స్ తో పాటు కట్ చేసిన షాట్స్ చూస్తే సూర్య నుంచి ఇది కదా మేం కోరుకున్నది అంటూ చాలా హ్యాపీగా ఫీలయ్యారు ఫ్యాన్స్. పూజా హెగ్డే కూడా ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా డైలాగ్స్ కంటే ‘ఎక్స్ ప్రెషన్స్’కు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసినట్టు కనిపించింద. మళయాల స్టార్ జోజూ జార్జ్, జయరాం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్యాన్ ఇండియా స్థాయిలో తనకు తిరుగులేని క్రేజ్ వస్తుందని నమ్మి చేసిన కంగువా పెద్ద దెబ్బ కొట్టింది. ఈ మూవీ పెద్ద షాకే ఇచ్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ డిజాస్టర్ గా మిగిలింది. బట్ ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో చోటు సంపాదించింది ఇండియన్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సూర్యకు ఓ కమ్ బ్యాక్ మూవీ చాలా అవసరం. అది కూడా మాస్ ను మెప్పించాల్సిన సినిమా కావాలి. అది ఇదే అని అభిమానులు నమ్ముతున్నారు. ఆ నమ్మకం నిజం చేస్తా అంటూ మే 1న రెట్రోతో రాబోతున్నాడు సూర్య. యస్.. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. మే డే రోజున రిలీజ్ చేయబోతున్నారు. నిండు వేసవిలో మంచి రిలీజ్ డేట్ దొరికిందనే చెప్పాలి. మరి ఈ మూవీతో అయినా సూర్య ఓ బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com