Hero Suriya : సూర్య తెలుగు సినిమా మొదలైంది

టాలెంటెడ్ స్టార్ సూర్య ఫస్ట్ టైమ్ తెలుగు సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ పై రూపొందబోతోన్న ఈ చిత్రాన్ని సితార ఆస్థాన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయబోతున్నాడు. కొన్నాళ్లుగా ఈ బ్యానర్ లో ఈ దర్శకుడు ఇతర భాషా హీరోలతో విజయాలు సాధిస్తున్నాడు. సార్ తో ధనుష్ కు వంద కోట్ల సినిమా ఇచ్చాడు. అలాగే లక్కీ భాస్కర్ తో దుల్కర్ కూ వంద కోట్ల మూవీ అందించాడు. అలా బ్యానర్ కు సైతం బ్లాక్ బస్టర్స్ ఇస్తూ వెళుతున్నాడు. వెంకీ కథల్లో కొంత వాస్తవికత ఉంటుంది. డ్రామా కంటే మోడ్రన్ స్క్రీన్ ప్లే తో మెప్పిస్తాడు. కన్విన్సింగ్ స్టోరీస్ తో ఆకట్టుకుంటాడు. అందుకే సూర్య కూడా తన ఫస్ట్ తెలుగు సినిమాను అతనితో చేస్తున్నాడు.
సూర్య సరసన హీరోయిన్ అంటూ రకరకాల పేర్లు వినిపించాయి కానీ.. ఫైనల్ గా మమిత బైజును తీసుకున్నారు. మమితతో పాటు కీర్తి సురేష్ కూడా ఉంటుందనే వార్తలు వచ్చాయి. బట్ అదేం లేదు. ప్రస్తుతానికి ఓపెనింగ్ కు మాత్రమ మమిత బైజు కనిపించింది. వీరితో పాటు వెటరన్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్, శరత్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇక ఈ నెలాఖరు నుంచి చిత్రీకరణ మొదలు కాబోతోన్న ఈ మూవీని వచ్చే యేడాది సమ్మర్ లో విడుదల చేయాలనుకుంటున్నారు. మొత్తంగా సూర్య కొన్నాళ్లుగా వీర ఫ్లాపుల్లో ఉన్నాడు. ఈ మూవీతో అతను ఆ ఫ్లాపుల పరంపరకు చెక్ పెట్టే అవకాశాలు చాలానే ఉన్నాయి. సూర్య లాంటి టాలెంటెడ్ ను వెంకీ ఎలా వాడతాడా అనే క్యూరియాసిటీ కూడా చాలామందిలో ఉంది. మరి ఈ కాంబోలో ఎలాంటి హిట్ వస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com