Surya : కొత్త సినిమా మొదలుపెట్టిన సూర్య

Surya : కొత్త సినిమా మొదలుపెట్టిన సూర్య
X

హీరో సూర్య కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సూర్య45’ పూజా కార్యక్రమం నిన్న జరిగింది. ఈ సినిమాకు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించనున్నారు. కోయంబత్తూర్‌లో తొలి షెడ్యూల్‌ జరుగుతుందని, సూర్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తామని దర్శకుడు తెలిపారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రానున్న ‘సూర్య 44’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘కంగువా’ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Tags

Next Story