Jai Bheem and Rudraveena: తమిళులకు జై భీమ్ అయితే.. మనకు రుద్రవీణ.. 1988లోనే క్యాస్ట్ గురించి..

Jai Bheem and Rudraveena: తమిళులకు జై భీమ్ అయితే.. మనకు రుద్రవీణ.. 1988లోనే క్యాస్ట్ గురించి..
Jai Bheem and Rudraveena: ఏ రంగంలో అయినా కులానిదే అగ్రపాత్ర. కులం పేరుతో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు పట్టం కట్టిన సందర్భాలు అనేకం.

Jai Bheem and Rudraveena: ఏ రంగంలో అయినా కులానిదే అగ్రపాత్ర. కులం పేరుతో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు పట్టం కట్టిన సందర్భాలు అనేకం. అయితే అవి సినిమాలకు అవార్డులు తెచ్చి పెడతాయేమో కానీ.. నిజ జీవితంలో కుల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. అగ్రవర్ణాలదే అన్నింటా పై చేయి. సమాజంలో దశాబ్ధాలు, శతాబ్ధాలు గడిచినా ఇంకా కుల వివక్ష పోలేదు. పాలేరు నుంచి పండితుడి వరకు సామాజిక వర్గాన్ని బట్టే వాళ్ల స్థానం ఆధారపడి ఉంటుంది.

కులం కంటే మనిషి, మానవత్వమే గొప్ప అని చాటి చెప్పే చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి అప్పుడు ఇప్పుడు కూడా. దాదాపు 33 ఏళ్ల క్రితం వచ్చిన రుద్రవీణ సినిమా, అంతకు ముందే వచ్చిన మాలపిల్ల.. తాజాగా తమిళంలో వచ్చిన జై భీమ్ చిత్రాలు సమాజంలో బలంగా పాతుకు పోయిన కులం నేపథ్యంలో సాగే కథాంశాలు.

కొడుకు పాత్రలో చిరంజీవి, తండ్రి పాత్రలో జెమినీ గణేశన్ పోటీ పడి నటించారు రుద్రవీణ సినిమాలో. తండ్రి నిష్టాగరిష్టుడైన బ్రాహ్మణ పండితుడు. కొడుకు చిరంజీవి తండ్రి వద్ద సంగీతంలో ప్రావిణ్యం సంపాదిస్తూనే సమాజంలో జరిగే అన్యాయానికి చింతిస్తూ తాను మాత్రం ఆ బాటలో పయనించకూడదని బలంగా నిర్ణయించుకుంటాడు. తండ్రిని గౌరవిస్తూనే సమాజసేవలో భాగంగా అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసి నిజమైన హీరో అనిపించుకుంటాడు..

జై భీమ్‌ ఓ వాస్తవ కథ. గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని లాయర్ చంద్రు వ్యతిరేకించి వారికి న్యాయం జరిగేలా చూస్తారు. కాయ కష్టం చేసుకుంటూ బతికే గిరిజనులపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టాలని చూసే పోలీసులను ప్రశ్నించే లాయర్ చంద్రు పాత్రలో సూర్య జీవించారు.

పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద వాళ్ల తరపున వాదించి గెలవడం కాదు నిజమైన లా అంటే. అన్యాయం అని తెలిస్తే అమాయకుల తరపున వాదించడానికి కూడా సిద్ధంగా ఉండాలని తెలియజెప్పే చిత్రం జై భీమ్. వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఓ చిన్న సంతృప్తిని మిగులుస్తాయి. ఇలాంటి చిత్రాలను కమర్షియల్‌ కోణంలో చూడకూడదు.

అవి ఎన్నితరాలు మారినా ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. సమాజంలో మార్పు రావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రగా ఏం చేస్తున్నామనే ఆలోచనను రేకెత్తిస్తాయి. ఆ కోవకే చెందుతాయి రుద్రవీణ, జై భీమ్ లాంటి సినిమాలు.

Tags

Read MoreRead Less
Next Story