Surya-Jyothika Daughter: తండ్రి సినిమాల్లో స్టార్. కూతురు చదువులో స్టార్.. పది పరీక్షా ఫలితాల్లో..

Surya-Jyothika Daughter: ముచ్చటైన కోలీవుడ్ జంట సూర్య, జ్యోతిక.. వీరికి ఇద్దరు చిన్నారులు దియా, దేవ్. కూతురు దియా చెన్నైలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. పది పూర్తి చేసింది. వచ్చిన ఫలితాల్లో
తమిళంలో 95, ఇంగ్లిష్‌లో 99, సైన్స్‌లో 98, సోషల్ స్టడీస్‌లో 95 మార్కులు సాధించినట్లు సమాచారం. చాలా మంది విద్యార్థులకు కష్టంగా అనిపించే గణితం సబ్జెక్టులో ఆమె ఫుల్ మార్క్స్ స్కోర్ చేసింది. తల్లిదండ్రులు సూర్య, జ్యోతిక కూతురి మార్కులు చూసి సంతోష పడుతున్నారు. తమ ఆనందాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారు.
కాగా, సూర్య అగరం ఫౌండేషన్‌ను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇది వేలాది మంది నిరుపేద పిల్లలకు వారి చదువులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది. ఈ స్కూల్లో చదువుకున్న అనేక మంది విద్యార్ధులు వైద్యులుగా, ఇంజనీర్లుగా రాణిస్తున్నారు. మరికొంత మంది లా విద్యను అభ్యసిస్తున్నారు. హీరో పిల్లలు కూడా కష్టపడి చదివి ఆదర్శంగా నిలుస్తున్నారని అభిమానులు ఆనందపడుతున్నారు.
ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'విక్రమ్'లో 'రోలెక్స్' పాత్రలో నటించిన సూర్యకు అద్భుతమైన ఆదరణ లభించింది. అతను ప్రస్తుతం బాల దర్శకత్వంలో 'సూర్య 41' షూటింగ్‌లో ఉన్నాడు, తరువాత సిరుత్తై శివ, సుధా కొంగర, వెట్రిమారన్ (వాడివాసల్), లోకేష్ కనగరాజ్ ('విక్రమ్ 3') మరియు 'అయలాన్' ఫేమ్ రవికుమార్ ఆర్‌లతో ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com