Sangeeth Sobhan : మ్యాడ్ కుర్రాడు దూసుకుపోతున్నాడుగా

మ్యాడ్ మూవీలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు సంగీత్ శోభన్. ఈ మూవీలో ధర్మోధర్ అలియాస్ డిడిగా బాగా ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలు ఎంతమంది ఉన్నా.. అతనే హైలెట్ గా నిలిచాడు. బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా మూవీస్ చేస్తున్నాడు. విశేషం ఏంటంటే.. అవన్నీ అతను హీరోగా నటిస్తోన్న మూవీస్. మ్యాడ్ తర్వాత మ్యాడ్ స్క్వేర్ తో మెప్పించాడు. తర్వాత గ్యాంబ్లర్ అనే మూవీలో తనే హీరోగా నటించాడు. ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా నిర్మాత నిహారిక నిర్మిస్తోన్న రాకాస మూవీలో హీరోగా నటిస్తున్నాడు. మానస శర్మ దర్శకత్వం చేస్తుంది. ఈ మూవీని ఏప్రిల్ 3న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సంగీత్ నుంచి అనౌన్స్ అయింది.
ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న మూవీలో హీరోగా సంగీత్ శోభన్ ను సెలెక్ట్ చేశారు. దీనికంటే బాగా ఆకట్టుకునే అంశం ఏంటంటే.. ఈ మూవీలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ కాంబినేషన్ గ్యారెంటీగా ఆకట్టుకుంటుంది. అనస్వర రీసెంట్ గా ఛాంపియన మూవీతో ఆకట్టుకుంది. తనే తెలుగులో స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పింది. మరో విశేషం ఏంటంటే.. కుమారి 21ఎఫ్ మూవీతో దర్శకుడుగా మారిన సూర్య ప్రతాప్ ఈ మూవీకి దర్శకుడు. అతని రీసెంట్ మూవీ 18 పేజెస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా ఈ ప్రాజెక్ట్ పై చాలామంది నమ్మకంగా ఉన్నారు. మొత్తంగా ఈ మూవీలో ఇంక కాస్టింగ్ ఏంటీ.. టెక్నీషియన్స్ ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
