Surya : టాలీవుడ్ అంతా కంగువ మయం
![Surya : టాలీవుడ్ అంతా కంగువ మయం Surya : టాలీవుడ్ అంతా కంగువ మయం](https://www.tv5news.in/h-upload/2024/10/25/1387853-kanguva.webp)
కంగువ.. మొన్నటి వరకూ ఈ సినిమా గురించి ఎవరూ పట్టించుకోలేదు. కోలీవుడ్ బాహుబలి అని వాళ్లకు వాళ్లే చెప్పుకుంటే కామెంట్స్ కూడా చేశారు. సూర్యకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మార్కెట్ కూడా ఉంది. అయినా పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ మొత్తం మార్చేసింది. అది కూడా రెండో రోజు. నిజానికి మొదటి రోజు ఫార్మల్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అదేమంత ప్రభావం చూపించలేదు. రొటీన్ గానే ముగిసిపోయింది. ఈ విషయం మేకర్స్ కు అర్థమైందో లేక ఇక్కడి పిఆర్వోలు చెప్పారో కానీ.. అస్సలు హైప్ రాలేదని అర్థమైంది. అంతే.. ఆ సాయంత్రమే సూర్య ఫ్యాన్స్ తో మీట్ అవుతారని ప్రచారం మొదలుపెట్టారు. కట్ చేస్తే నెక్ట్స్ డే ఏ.ఎమ్.బి మాల్ లో జరిగిన ఫంక్షన్ కు ఊహించనంత మంది ఫ్యాన్స్ వచ్చారు. ఇంత మంది వస్తారని తెలిస్తే మాల్ లో కాకుండా ఏదైనా ఓపెన్ ప్లేస్ లో లేదా ఇంకేదైనా పెద్ద ఫంక్షన్ హాల్ లో అరేంజ్ చేసి ఉంటే మరింత క్రౌడ్ వచ్చేదని అర్థమైంది.
ఈ ఫ్యాన్ మీట్ కు వచ్చిన జనాలను చూసి సూర్య చాలా ఎమోషనల్ అయ్యాడు. మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తన సినిమా వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు చేస్తుందని నిర్మాత చెప్పడాన్ని ఎలా చూస్తారని మీడియా అడిగితే.. 'పెద్ద కలలు కనడం క్రైమ్ కాదు కదండీ' అంటూ చెప్పిన ఆన్సర్ కి అంతా ఫిదా అయిపోయారు. నిర్మాత జ్నానవేల్ రాజా మాత్రం ఈ మూవీ గురించి ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్నాడు. బాహుబలిని మించి అనేలా మాట్లాడుతున్నాడు.
నిజానికి కోలీవుడ్ లో ఈ మూవీని తమిళ్ బాహుబలి లాంటిది అంటున్నారు. అంటే కంటెంట్ పరంగా కాదు. రేంజ్ పరంగా చూస్తున్నారు. తెలుగు వారికి బాహుబలి కన్నడ వారికి కేజీఎఫ్ లాగా తమిళ్ వారికి కంగువా మారబోతోందనే అనుకుంటున్నారు. మరి అలా జరుగుతుందో లేదో కానీ.. రెండు రోజులుగా కంగువకు ఊహించని రేంజ్ లో పబ్లిసిటీ వచ్చింది. మరి ఈ పబ్లిసిటీని రిలీజ్ డేట్ నవంబర్ 14 వరకూ హోల్డ్ చేసుకోగలిగితే.. ఖచ్చితంగా తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ వస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com