Suryadevara Naga Vamsi: ప్రేక్షకులను అవమానించిన 'భీమ్లా నాయక్' నిర్మాత.. ఆపై సారీ చెప్తూ..

Suryadevara Naga Vamsi: ఎంతమంది కష్టపడి ఒక సినిమాను పూర్తిచేసినా.. అది చివరిగా వచ్చి మెప్పించాల్సింది ప్రేక్షకులనే. ప్రేక్షకులు లేనిదే సినిమా లేదని ఇప్పటికీ ఎంతోమంది ప్రముఖ నటీనటులు చాలాసార్లు చెప్పారు. అయితే ఆ ప్రేక్షకుడిని అవమానిస్తే కూడా పరిణామాలు అంతే తీవ్రంగా ఉంటాయి. దానికి ఎంతటి నిర్మాత అయినా వెనక్కి తగ్గాల్సిందే అని 'భీమ్లా నాయక్' నిర్మాత సూర్యదేవర నాగవంశీ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రెండు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను నిర్మించాడు నాగవంశీ. అందులో ఒకటైన 'డీజే టిల్లు' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ అందుకుంటోంది. అందుకే మూవీ టీమ్ గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ సక్సెస్ మీట్‌లో ప్రేక్షకుడు మేధావి కాదని.. వాడు పెట్టిన డబ్బులకు ఎంటర్‌టైన్మెంట్ అందిస్తే చాలని, ఆ ఎంటర్‌టైన్మెంట్ తమ సినిమా చూసినవారికి దక్కిందని అన్నారు నాగవంశీ.
ఇలా సినిమాకు ప్రాణంలాగా నిలిచే ప్రేక్షకుడిని ఏకవచనంతో మాట్లాడడం చాలామందికి నచ్చలేదు. అందుకే ఆయనపై నెగిటివ్‌గా వార్తలు వచ్చాయి. దీనిపై నాగవంశీ స్పందించారు. ప్రేక్షకులను సోదరులుగా భావించే అలా అన్నానని, వారే మా బలం అని ప్రేక్షకులకు క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం అంతటా వైరల్‌గా మారింది.
— Naga Vamsi (@vamsi84) February 18, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com