Sushant Singh Rajput: బాలీవుడ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సుశాంత్ సోదరి.. ఎవ్వరికీ అంత ధైర్యం లేదంటూ..

Sushant Singh Rajput: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య ఒక్కసారిగా బీ టౌన్‌లో పెద్ద సంచలనమే సృష్టించింది. అది ఆత్మహత్య పోలీసులు చెప్తున్నా కూడా తన అభిమానులు మాత్రం అది హత్యే అని గట్టిగా నమ్మారు. అందుకే సుశాంత్ కేసును స్పెషల్ డీల్ చేయాలని కోరారు. దీంతో ఆ మరణం హత్యే ఏమో అన్న కోణంలో పోలీసులు కూడా దీన్ని హత్యే ఏమో అని విచారణ చేపట్టారు. అయినా ఇంకా సుశాంత్‌కు మాత్రం న్యాయం దొరకలేదు. దీంతో సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ బాలీవుడ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.
సుశాంత్ జయంతికి ఇంకా పదిరోజులు కూడా లేదు. అందుకే మరోసారి తన గురించి అందరూ గుర్తుచేసుకుంటున్నారు. అలాగే తన సోదరి ప్రియాంక సింగ్ కూడా సుశాంత్‌తో దిగిన ఓ పాత ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బాలీవుడ్ కోసం ఒక సందేశాన్ని జతచేసింది. దీంతో సుశాంత్ అభిమానులంతా ఈ పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు.
'సుశాంత్‌కు న్యాయం జరిగేంత వరకు తనపై ఏ సినిమా తెరకెక్కించకూడదు. ఇది నా సోదరుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు నేను చేస్తున్న ప్రమాణం. పైగా ఆన్ స్క్రీన్ మీద సుశాంత్‌లాగా అమాయకంగా, డైనమిక్‌గా, అందంగా ఎవరు నటించగలరని నాకు ఆశ్చర్యం వేస్తుంది. పైగా ఎప్పుడూ భయపడుతూ బ్రతికే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా సుశాంత్ లాంటి ఉన్నతమైన కథను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ధైర్యం ఉందంటే అది కేవలం నా భ్రమ మాత్రమే. తన వంశాన్ని, అన్నింటిని పక్కన పెట్టి తనకు నచ్చినట్టు బ్రతకడం కోసం సుశాంత్ కష్టపడ్డాడు' అంటూ మరోసారి సుశాంత్‌ను అభిమానులకు గుర్తుచేసి ఎమోషనల్ చేసింది ప్రియాంక.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com