Sushanth : 'రావణాసుర'లో సుశాంత్.. ఫస్ట్ లుక్ బీభత్సం..!

Sushanth : మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.. వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. అందులో భాగంగానే డైరెక్టర్ సుధీర్ వర్మతో 'రావణాసుర' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా, సంక్రాంతి కానుకగా జనవరి 14న మూవీ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రతో పాటు పది గెటప్‌లలో అలరించనున్నాడని టాక్ నడుస్తోంది.
ఇదిలావుండగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇందులో యంగ్ హీరో అక్కినేని సుశాంత్ .. రామ్ అనే ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని సుశాంత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. అంతేకాకుండా రామ్ పాత్రలో ఉన్న సుశాంత్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ కూడా విడుదల చేశారు.
చూస్తుంటే ఇందులో సుశాంత్ ది నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని తెలుస్తోంది. రెడ్ అండ్ బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో లాంగ్ హెయిర్‌తో ఇంటెన్సివ్ లుక్‌లో కనిపించాడు సుశాంత్. తాజా అప్డేట్ తో సినిమా పైన మరిన్ని అంచనాలు పెంచేశారు మేకర్స్ .. కాగా ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
Into the World of DEMONS! 👺
— Sushanth A (@iamSushanthA) January 11, 2022
Thank you for this sizzling welcome as #RAM in #RAVANASURA 🔥
Mass Maharaja @RaviTeja_offl Sir,@sudheerkvarma @AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks
🎉🤗
Hope you guys like #RAMFirstLook ! pic.twitter.com/jDu6IAoOLw
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com