Sushmitha Sen: లలిత్ మోదీతో బ్రేకప్, ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించిన విశ్వసుందరి

Sushmitha Sen: లలిత్ మోదీతో బ్రేకప్, ట్రోలింగ్ పై ఘాటుగా స్పందించిన విశ్వసుందరి
X
అలాంటి విమర్శలను పట్టించుకోనన్న సుస్మితా సేన్

సుస్మితా సేన్ మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చే మహిళ. అయితే ఈ మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి రీసెంట్ డేస్ లో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు. 'గోల్డ్ డిగ్గర్' అంటూ ఆమెను విమర్శిస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సుస్మితా సేన్ కాస్త ఘాటుగానే స్పందించింది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అంటూ తనను విమర్శిస్తున్నారని... ఇలాంటి విమర్శలను తాను పట్టించుకోనని వ్యాఖ్యానించారు. అవమానాలను స్వీకరించడం అంటే అది అవమానమేనని, అందుకే తాను స్వీకరించనని చెప్పారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అన్న ఆమె.. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని స్పష్టం చేశారు. తనపై వచ్చే కామెంట్లపై స్పందించవద్దని ఇండస్ట్రీలోని ఎంతో మంది తనకు చెప్పారని అన్నారు. తనకు సంబంధించిన వ్యవహారాలపై తనకు ఇష్టం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు. తనకు గోల్డ్ కంటే డైమండ్స్ అంటే ఇష్టమని... తన కోసమే వాటిని కొంటుంటానని తెలిపారు.





బాలీవుడ్ లో సినిమాల కంటే లవ్ ఎఫైర్స్‌తో ఎక్కువ పాపులర్ అయిన సుస్మితా సేన్.. అంతర్జాతీయ అందాల పోటీ మిస్ యూనివర్స్ 1994 విజేతగా కిరీటం ధరించింది. ఆమె ఇప్పటివరకు దాదాపు 13మందితో ప్రేమలో పడిందనే టాక్ కూడా ఉంది. దీంతో సుస్మితా.. ఎప్పుడూ ఏదో ఒక లవ్ టాపిక్ తో ట్రెండింగ్ లో నిలుస్తూనే ఉంటుంది. తనమొన్నటి వరకు తనకన్నా చిన్నవాడైన రోహ్మన్‌ షాల్‌ తో రిలేషన్ లో ఉంది. ఈ ఇద్దరు కలిసి చట్టపట్టాలేసుకు తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయ్యాయి. అంతే కాదు అతడితో ఉన్న ఫొటోలను కూడా ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఉన్నట్టుండి అతడికి బ్రేకప్ చెప్పేసింది. కొద్ది రోజులు ఒంటరిగా గడిపిన సుష్మిత.. ఆ తర్వాత ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో ప్రేమలో పడింది. ఆయనతో కలిసి ఉన్న ఫొటోలు సైతం నెట్టింట వైరల్ కావడంతో ఆమె లలిత్‌ మోదీలో రిలేషన్ లో ఉందని క్లారిటీ వచ్చింది.




ఈ మధ్యే అతడికి కూడా బ్రేకప్ చెప్పేసింది సుష్మిత. ఈ నేపథ్యంలో డబ్బుకోసమే లలిత్‌ మోదీతో ప్రేమలో పడిందని సుష్మిత పై ట్రోల్స్ వచ్చాయి. డబ్బు కోసం ఏమైనా చేస్తుందంటూ పలువురు మితిమీరి కామెంట్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఆమ ఈ కామెంట్స్ పై, విమర్శలపై స్పందించలేదు, ఖండించలేదు. కానీ తాజాగా ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సుష్మిత.. లలిత్ మోదీతో బ్రేకప్ పై మాట్లాడింది. ట్రోలర్స్ కు గట్టి సమాధానమిచ్చింది.



Tags

Next Story