Gangs Of Godavari : క్లాసికల్ మెలోడీ 'సుట్టంలా సూసి' ఫుల్ సాంగ్ రిలీజ్

Gangs Of Godavari : క్లాసికల్ మెలోడీ సుట్టంలా సూసి ఫుల్ సాంగ్ రిలీజ్
'సుట్టంలా సూసి' ఫుల్ వీడియో సాంగ్ విడుదల

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సుట్టంలా సూసి ఫుల్ వీడియో సాంగ్ రిలీజైంది. ఈ పాటను మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో కళాశాల విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో అనురాగ్ కులకర్ణి ఈ పాటను పాడాడు. అనంతరం మొదటి సింగిల్ 'సుట్టంలా సూసి' అనే సాంగ్ ను ఆవిష్కరించారు. ఈ క్లాసికల్ మెలోడీ, టైమ్‌లెస్ ట్యూన్‌లను రూపొందించడం అనేది యువన్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. శ్రీ హర్ష ఈమని ఈ పాటకు అందమైన సాహిత్యంను అందించారు.

పేదరికం నుంచి ధనవంతుడిగా మారాలన్న లక్ష్యంతో రూపొందుతున్న కథాంశంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని రూపొందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో DJ టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు అంజలి కూడా ముఖ్యమైన సహాయ పాత్రలో కనిపించనుంది. రచయిత-దర్శకుడు అయిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోదావరి డెల్టా నేపథ్యంలో సాగే పీరియాడికల్-గ్యాంగ్‌స్టర్-డ్రామాగా ఈ చిత్రం రాబోతోంది.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించి విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ఇప్పటికే సంచలనం సృష్టించాయి. దీంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.



Tags

Read MoreRead Less
Next Story