Sri Vishnu : స్వాగ్ ట్రైలర్.. హద్దులు దాటిన జెండర్ వార్

డిఫరెంట్ స్టోరీ సెలక్షన్ తో ఎప్పటికప్పుడు ఆకట్టుకునే హీరో శ్రీ విష్ణు. కంటెంట్ తో పాటు కామెడీ కూడా ఉండేలా చూసుకోవడం అతని స్పెషాలిటీ. ఇదే ఈ తరం హీరోల్లో శ్రీ విష్ణును ప్రత్యేకంగా చూపిస్తుంది. ప్రస్తుతం అతను స్వాగ్ అనే మూవీతో వస్తున్నాడు. అతనితోనే రాజా రాజ చోర అనే హిట్ మూవీని రూపొందించిన హసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకుడు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ తో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నారు. లేటెస్ట్ గా వచ్చిన ఓ మెలోడియస్ సాంగ్ సైతం ఆకట్టుకుంది. అక్టోబర్ 4న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మూడు నాలుగు తరాలుగా మగ వారసుడి కోసం తాపత్రయ పడుతూ.. అంతులేని సంపదను అందించే ప్రయత్నంలో ఉంటుంది స్వాగణికి వంశం. ఆ వంశానికే చెందిన వ్యక్తిగా శ్రీ విష్ణుతో పాటు రీతు వర్మ కనిపిస్తున్నారు. ఆ ఆస్తిని దక్కించుకునేందుకు అన్ని తరాల్లో వీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనే పాయింట్ తో పాటు మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువ అనే పాత్రలో రీతూ వర్మ కనిపిస్తూ.. ఈ రెండు జెండర్స్ మధ్య ఆధిపత్య పోరాటంతో సాగే కథనం హిలేరియస్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దీంతో పాటు ఓ ఇంటెన్సిటీ కూడా కనిపిస్తోందీ ట్రైలర్ లో. ట్రైలర్ చివర్లో వచ్చిన డైలాగ్ చూస్తే కాస్త అడల్డ్ డైలాగ్స్ ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ తో స్వాగ్ ప్రామిసింగ్ మూవీలా ఉంది. హసిత్ గోలి మరోసారి తనదైన కామెడీ టైమింగ్ ను చూపించబోతున్నాడని అర్థం అవుతోంది.
శ్రీ విష్ణు సరసన రీతూ వర్మ తో పాటు మీరా జాస్మిన్, దక్షా నగార్కర్ కనిపిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించిన స్వాగ్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మరి అక్టోబర్ 4న ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com