Nag Ashwin Champion : కల్కి బ్యానర్ నుంచి ఛాంపియన్ వస్తున్నాడు

Nag Ashwin Champion :  కల్కి బ్యానర్ నుంచి ఛాంపియన్ వస్తున్నాడు
X

వైజయంతీ మూవీస్ బ్యానర్ గురించి తెలియని తెలుగు ఫిల్మ్ లవర్ ఉండడు. అలాంటి బ్యానర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నిర్మాత అశ్వనీదత్ కూతురుళ్లు స్వప్న సినిమాస్ అనే బ్యానర్ పెట్టి చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సాధించారు. నాగ్ అశ్విన్ ఆ ఇంటి అల్లుడు కూడా అయిన తర్వాత చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలు ఆ బ్యానర్ స్థాయిని కూడా పెంచాయి. వైజయంతీలో మరోసారి కల్కి రూపంలో భారీ విజయం అందుకున్న ఈ టీమ్ నుంచి ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. అయితే ఇది భారీ చిత్రం కాదు. మీడియం రేంజ్ మూవీ. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించబోతున్నాడు.

సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్ రైటర్ గా బాగా ఫేమ్ అయిన ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అతను ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ తో దర్శకుడుగా సత్తా చాటి ఉన్నాడు. కామెడీతో పాటు ఎమోషన్ ను కూడా బాగా రాయగలడు. ప్రదీప్ డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రానికి ‘ ఛాంపియన్ ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథట. తాజాగా నాగ్ అశ్విన్ క్లాప్ ఇన్ తో స్టార్ట్ అయింది. త్వరలోనే ఈ మూవీ ఇతర కాస్ట్ అండ్ క్రూకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ చిత్ర నిర్మాణంలో స్వప్న సినిమాస్ తో పాటు కాన్సెప్ట్ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ కూడా భాగస్వామిగా ఉన్నాయి.

Tags

Next Story