Bigg Boss Swetha Varma : బిగ్‌బాస్ నుంచి శ్వేత వర్మ ఔట్... ఆమెకి రెమ్యునరేషన్ ఎంత ముట్టిందంటే?
Bigg Boss Swetha Varma : బిగ్‌బాస్‌లో గెలవడం అనేది ఓ కల.. ఆ కలను నిజం చేసుకునేందుకు చాలా మంది హౌజ్ లోకి అడుగుపెడతారు.. అయితే ఆ అదృష్టం కొందరిని మాత్రమే వరిస్తుంది. అలా ఎన్నో అంచనాలతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లోకి అడుగుపెట్టింది శ్వేత వర్మ.. ద రోజ్ విల్లా, ముగ్గురు మొనగాళ్లు, పచ్చీస్, సైకిల్ వంటి పలు చిత్రాల్లో నటించింది కానీ.. అనుకున్నంత ఫేం అయితే ఆమెకి రాలేదు.
ఈ క్రమంలో బిగ్‌బాస్ షోతో ప్రేక్షకులకి మరింత దగ్గర కావాలని అనుకుంది. అలా బిగ్‌బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టింది. మొదట్లో కాస్త సైలెంట్ గానే ఉన్న ఆ తర్వాత ఒకానొక నామినేషన్స్‌లో ఉగ్రరూపం చూపించింది. అమర్యాదగా మాట్లాడుతున్నావంటూ లోబో పైన ఫైర్ అయింది. హమీదాని కొట్టినంత పనిచేసింది. ఆరోవారంలో నామినేషన్ లోకి వచ్చి చివరికి ఎలిమినేట్ అయింది.
ప్రేక్షకుల నుంచి ఆమెకి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్టుగా హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. కాగా ఆమె ఉన్న ఇన్నిరోజులకి గాను శ్వేత.. బిగ్‌బాస్ నుంచి ఎంత సంపాదించిందని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ఆమెకు రూ. 60- 90 వేల వరకు ఇస్తున్నారట..
ఈ లెక్కన చూసుకుంటే ఆ ఆరు వారాలకి గాను సుమారు 5 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు సమాచారం. అటు శనివారం లోబోని ఎలిమినెట్ అయ్యడంటూ అతడ్ని సిక్రెట్ రూమ్ లో ఉంచారు. బిగ్‌బాస్ చెప్పేవరకు అక్కడే ఉండాలని హోస్ట్ నాగార్జున ఆదేశించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com