Taapsee Pannu : ప్రతీకారం తీర్చుకునే తల్లి పాత్రలో తాప్సీ

Taapsee Pannu : ప్రతీకారం తీర్చుకునే తల్లి పాత్రలో తాప్సీ

ప్రతీకారం తీర్చుకునే తల్లిపాత్రలో కనిపించబోతోంది తాప్సీ పన్ను. ఆమె హీరోయిన్ గా ‘గాంధారి' అనే కొత్త సినిమాను ప్రకటించారు మేకర్స్. నెట్ ప్లిక్స్ వేదికగా ఇది ప్రసారం కానుంది. బాలీవుడ్ స్టార్ తాప్సీ పన్ను, రచయిత్రినిర్మాత కనికా ధిల్లాన్ “గాంధారి” పేరుతో కొత్త ఫీచర్ ఫిల్మ్ కోసం మళ్లీ కలుస్తున్నట్లు స్టీమింగ్ సర్వీస్ నెట్క్స్ ఇవాళ ప్రకటించింది. వీళ్లిద్దరి కాంబోలో “హసీన్ దిల్రూబా ”, “ఫిర్ ఆయీ హస్సీన్” సినిమాలు వచ్చాయి. ‘గాంధారి” యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. తల్లీ, బిడ్డల మధ్య ఉన్న గాఢమైన బంధానికి ప్రతీక అని యూనిట్ తెలిపింది. 'గాంధారి' కనికరంలేని పాత్ర. ప్రేక్షకులు తాప్సీ పన్నును ఒక మిషన్లో భయంకరమైన తల్లిగా చూస్తారు” అని కనికా ధిల్లాన్ తెలిపారు.

Tags

Next Story