కెరీర్ ఆరంభంలో హీరోల భార్యలు నన్ను..

నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఎన్నో అవమానాలు, మరెన్నో అవరోధాలు.. అన్నింటిని అధిగమించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి పవర్‌ఫుల్ పాత్రలు పోషిస్తోంది.. అభిమానులకు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు అందిస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అందంగా లేననే కారణంతో కొంతమంది హీరోల భార్యలు నన్ను ఇష్టపడేవారు కాదు. తమ భర్త పక్కన నేను హీరోయిన్‌గా కనిపించడాన్ని అంగీకరించేవారు కాదు. నా స్థానంలో వేరే హీరోయిన్లకు అవకాశం ఇప్పించేవారు. అలాగే కొందరు నిర్మాతలు కూడా నన్ను హీరోయిన్‌గా తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు.
ఇదిలా ఉంటే మరో సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ కంటే నా ఇంట్రడక్షన్ సీన్ బాగా వచ్చింది. దాంతో డైరెక్టర్‌కు చెప్పి ఆ హీరో నా సీన్‌ను మార్చేశాడు. నాకు తెలిసి ఇలాంటివి ఎన్నో జరిగాయి.. తెలియకుండా ఇంకెన్ని జరిగి ఉంటాయో.. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో నిలబడాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.. ఎన్నింటినో భరించాలి అని వివరించింది.
Tags
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com