Tabu: నాతో అబ్బాయిలు ఎవరైనా మాట్లాడితే కొట్టేవాడు.. ఆ హీరో వల్లే నేను పెళ్లి చేసుకోలేదు..

Tabu (tv5news.in)
Tabu: అసలు తనకు వయసు పెరగదా..? అప్పటికి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందేంటి..? తన అందంతో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందిగా.. సీనియర్ హీరోయిన్ టబును చూడగానే ప్రేక్షకులకు ముందుగా వచ్చే డౌట్లు ఇవి. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు మనల్ని అలరిస్తున్నా వారిలో టబు చాలా స్పెషల్. తల్లి పాత్రలు చేసినా కూడా ఆమె ఇంకా స్టైలిష్‌గానే కనిపిస్తుంది. తను ఇంకా హీరోయిన్‌గా సినిమాలు చేసినా చూసే అభిమానులను సంపాదించుకుంది.
కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి గురించి ఆలోచించరు కొందరు నటీనటులు. ఒకవేళ తమ కెరీర్ అసలు ఎప్పటికీ డౌన్‌ఫాల్ అవ్వకపోతే..? అసలు పెళ్లే చేసుకోరా..? అలాంటి నటీనటులు ఉన్నారా..? ఉన్నారు. ఈ విషయాన్ని నిరూపించడానికి చాలామంది నటీనటులు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. 30 ఏళ్లు దాటితే నటి కెరీర్ స్మాష్.. అనే మూఢనమ్మకాలను దాటుకుంటూ ఇంకా సినిమాల్లో బిజీగా గడిపేస్తున్న నటి టబు. కానీ టబు ఎందుకు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకు దొరకలేదు. కానీ తాజాగా తన ఇంటర్వ్యులో పెళ్లి గురించి టబు మాట్లాడిన మాటలు వైరల్‌గా మారుతున్నాయి.
తాను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కారణమంటూ పెద్ద బాంబ్‌నే పేల్చింది టబు. అసలు అజయ్ ఎందుకు కారణమని తమ ఫ్లాష్‌బ్యాక్‌ను చెప్పుకొచ్చింది. అజయ్, టబు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండే పరిచయటమట. అజయ్ తన అన్న స్నేహితుడని, అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అన్నారు టబు. వీరంతా కలిసి జుహులోని పెరిగారని చెప్పింది.
అజయ్.. టబును ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండేవాడని, తనతో ఎవరైనా మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడని పేర్కొంది. అంతే కాక అబ్బాయిలు ఎవరైనా తనతో క్లోజ్‌గా మాట్లాడితే కొట్టడానికి కూడా సిద్ధమయిపోయేవాడట అజయ్. ఇక అతడి వల్లే తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని టబు వెల్లడించింది.
ఇంత జరిగినా కూడా టబు, అజయ్ కలిసి పలు సినిమాల్లో కలిసి నటించారు. 'విజయ్‌పథ్', 'హకీకత్' సినిమాల్లో టబు, అజయ్ దేవగన్ హీరోహీరోయిన్లుగా కలిసి నటించారు. 'దృశ్యం', 'గోల్‌మాల్ అగెయిన్'లో అజయ్ హీరోగా నటించగా టబు కీలక పాత్రల్లో కనిపించింది. వీరు చివరిగా 'దేదే ప్యార్ దే' సినిమాలో విడాకులు తీసుకున్న కపుల్‌గా కనిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com