Vijay Devarakonda : విజయ్ మూవీకి వీళ్లు బెస్ట్ ఛాయిస్

సినిమాలకు సంబంధించి లాంగ్వేజ్ బారికేడ్స్ ఎప్పుడో తొలగిపోయాయి. ఎవరు ఏ భాషలో అయినా సినిమాలు చేయొచ్చు. ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్స్ వరకూ టాలెంట్ ఉంటే చాలు.. పెద్ద పెద్ద మేకర్స్ కూడా అప్రోచ్ అవుతుంటారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో ఇది బాగా కనిపిస్తోందీ మధ్య. మళయాలం, తమిళం, కన్నడ మాత్రమే కాక బాలీవుడ్ నుంచి కూడా టెక్నీషియన్స్ ను రప్పిస్తున్నారు. అలా ఇప్పుడు తెలుగులోకి చాలామంది పరభాషా సింగీత దర్శకులు వస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడో టాలీవుడ్ కు రావాల్సిన మ్యూజికల్ ద్వయం విజయ్ దేవరకొండ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.
ఆ సంగీత దర్శకద్వయం అజయ్- అతుల్. మరాఠీలో వీళ్లకు ఉన్న క్రేజ్ చిన్నది కాదు. హిందీలోనూ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఉన్నాయి. వీళ్లు ఇప్పటికీ పాత పద్ధతిలో అన్ని ఇన్స్ స్ట్రుమెంట్స్ తో లైవ్ రికార్డింగ్ తో పాటలు చేస్తుంటారు. వీరిలో అజయ్ గొప్ప సింగర్ కూడా. కంపోజింగ్ లో వీరి శైలి భిన్నంగా ఉంటుంది. సహజమైన సౌండింగ్ వీరి స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీ వల్లే ఆ ఇద్దరినీ తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్.
రాహుల్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటించబోతోన్న పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీకి ఈ ఇద్దరినే సంగీత దర్శకులుగా సెలెక్ట్ చేసుకున్నారు. కొన్నాళ్ల క్రితం మరాఠీలో సంచలన విజయం సాధించిన సైరాట్ సంగీత దర్శకులు కూడా వీళ్లే. మొత్తంగా టాలీవుడ్ కు మరో మ్యూజికల్ డ్యూయొ పరిచయం అవుతున్నారు. మరి వీరు ఈ అవకాశాన్ని ఎంత అద్భుతంగా వాడుకుంటారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com