Tamanna: తమన్నా హోస్టింగ్ బాలేదట.. అందుకే ఇకపై మాస్టర్ చెఫ్ తెలుగులో..

Tamanna: ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న యంగ్ నటీనటులు కేవలం సినిమాల్లోనే కాకుండా ఇతర ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా తమ టాలెంట్‌ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఓటీటీ అనేది వచ్చిన తర్వాత నటీనటులు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అవకాశాలు పెరిగాయి. అందుకే యాక్టింగ్‌తో పాటు హోస్టింగ్, యాంకరింగ్ వైపు కూడా ఒక అడుగేస్తున్నారు. అలా చేస్తున్నవారిలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకరు.
సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా కెరీర్ ఈమధ్య కాస్త స్లో అయ్యింది. అందుకే హోస్టింగ్‌తో తన లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యింది. మాస్టర్ చెఫ్ అనేది జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా పేరున్న షో. అలాంటి మాస్టర్ చెఫ్ తెలుగు వర్షన్‌తో హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులను పలకరించింది తమన్నా. కొన్నిరోజులు తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను బాగానే అలరించింది. కానీ ఇప్పుడు తమన్నా ఈ షో నుండి తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తమన్నాకు ఇంతకు ముందు హోస్టింగ్ అనుభవం లేదు. అందుకే మాస్టర్ చెఫ్‌ను హ్యాండిల్ చేయలేకపోతుందని నిర్వాహకులు భావిస్తున్నారట. మిగతా చానెళ్లలో వస్తున్న రియాలిటీ షోల టీఆర్‌పీలతో పోలిస్తే మాస్టర్ చెఫ్ తెలుగుకు కనీస టీఆర్‌పీలు రాక నిర్వాహకులు నష్టపోతున్నారట. అందుకే తమన్నా కాకుండా అనసూయ ఈ షోను హోస్ట్ చేస్తే టీఆర్‌పీలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ ఇవ్వనుంది మాస్టర్ చెఫ్ తెలుగు టీమ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com