ODELA 2 TRAILER : ఓదెల 2 ట్రైలర్.. అదరగొట్టిన తమన్నా

ODELA 2 TRAILER :  ఓదెల 2 ట్రైలర్.. అదరగొట్టిన తమన్నా
X

తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 మూవీ ట్రైలర్ విడుదలైంది. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు. ఆ మధ్య విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. స్పందనతో పాటు భారీ బిజినెస్ కూడా అయింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే స్పైన్ చిల్లింగ్ అనే చెప్పాలి. ఓదెల చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ చూస్తే..

‘భరత ఖండాన దక్షిణ గంగా తీరానా ఆ పరమాత్ముడు పుట్టిల్లైన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పోసుకుంటుంది. ఆవిరైన ప్రతి రక్తపుబొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తుంది..’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ లో ప్రతి షాట్ సూపర్బ్ అనేలా ఉంది. ఆ భూపతి చనిపోయిన తర్వాత ఆత్మ ఎందుకు అయ్యాడు. మిగతా ఆత్మలను సమీకరించి తను అత్యంత శక్తివంతమైన విలన్ గా ఎలా మారాడు అనే కోణం విలన్ లో ఉంటే.. ఆ విలన్ ను అంతం చేయడానికి పంచాక్షరి అనే ఆయుధంతో పరమాత్ముడు పంపిన దూతగా అఘోరీగా తమన్నా ఎంట్రీ కనిపిస్తుంది. ఈ క్రమంలో వచ్చిన ‘మన నిలబడటానికి భూమాత కావాలి.. జీవించడానికి గోమాత కావాలి.. ’ అనే డైలాగ్.. ఇప్పటి ట్రెండ్ కోసం రాసుకున్నట్టుగా కనిపిస్తుంది.

మమూలుగా ఇలాంటి సినిమాల్లో దెయ్యం, దేవుడు మధ్య యుద్ధం కనిపిస్తుంది. ఇక్కడా అంతే. కాకపోతే పరమాత్ముడి ప్రతినిధిగా తమన్నా కనిపిస్తోంది.

అయితే ఈ ట్రైలర్ ను అద్భుతంగా కట్ చేశాడు. ఓ గొప్ప హారర్ కంటెంట్ తో పాటు థ్రిల్లింగ్ మూవీని చూడబోతున్నాం అనేలా ఉంది.

తమన్నాతో పాటు వశిష్ట సింహా, హెబా పటేల్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాంతార, విరూపాక్ష, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అతని నేపథ్య సంగీతం సినిమాకు బ్యాక్ బోన్ అవుతుందని ట్రైలర్ లోనే తెలుస్తోంది.

మొత్తంగా ఓ వైపు ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతున్న తమన్నా సడెన్ గా అఘోరీగా మారి ఆడియన్స్ ను అలరించడానికి ఈ నెల 17న రాబోతోంది.

Tags

Next Story