తమన్నా, విజయ్ ల ప్రేమ వ్యవహారంపై మరో క్లారిటీ..!

టాలీవుడ్ ఫేమ్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ మొదటినుంచి ఎంతో జాగ్రత్తగా అడుగులు వేసిన తమన్నా, తన ప్రేమ వ్యవహారంలో కూడా అంతే జాగ్రత్తగా మసులుకుంది. ఒక రకంగా తనకు తాను వ్యక్తపరిస్తేకాని బయటకు తెలియలేదు. ఈ ప్రేమ పక్షుల గురించి చిన్న క్లూ కూడా బయటకు రాలేదంటే వీరి ప్రేమ వ్యవహారం ఎంతజాగ్రత్తగా నడిచిందో తెలుస్తూనే ఉంది. వీరి ప్రేమ గురించి తెలిసినప్పటినుంచి తెలుగు, హిందీ, తమిళ్ అనే తేడా లేకుండా పలు ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
తాజాగా విజయ్ వర్మ తమ ప్రేమ విషయం గురించి బహిరంగంగానే చెప్పాడు. తమన్నాతో తనది గాఢమైన ప్రేమ అని వ్యక్తపరిచాడు.. తమన్నా తన జీవితంలోకి వచ్చినప్పటినుంచి తాను ఎంతగానో సంతోషాన్ని పొందుతున్నానని అన్నాడు. తమన్నా కూడా తమ రిలేషన్ పై మౌనం వీడింది. ప్రేమ మాట నిజమేనని చెప్పింది. విజయ్ మాత్రం తన కెరీర్ ఇప్పుడు పట్టాలెక్కిందని చెప్పాడు. "నా ప్రేమ గురించి సరైన సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో, ప్రేమలో చాలా సంతోషంగా ఉన్నాను" అని అన్నాడు.
విజయ్ తో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది తమన్నా. విజయ్ తనను ఎంతో అర్థం చేసుకుంటాడని అలాంటి వ్యక్తి తన జీవితంలోకి రావడం చాలా సంతోషాన్నించిందని చెప్పింది. ఏదో ఒక రోజు తామిద్దరం ఒకటవుతామని తెలిపింది. ప్రస్తుతం ఇద్దరి కెరీర్ లు సక్సెస్ ఫుల్ గా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేసింది.
వీరిద్దరి ప్రేమ వ్యవహారం 2023 న్యూ ఇయర్ వేడుకల్లో బయటపడింది. న్యూ ఇయర్ వేడుకలకు తమన్నా, విజయ్ గోవాకు వెళ్లారు. కొత్త ఏడాదికి వెల్కమ్ చెబుతూ లిప్ లాక్ పెట్టుకున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ వార్త గుప్పుమంది. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ లో వీళ్లిద్దరికీ పరిచయమై... ఆ చనువు కాస్తా ప్రేమగా మారిందని చెప్పారు. తాజాగా తమన్నా, విజయ్ లు లస్ట్ స్టోరీస్ 2 లో కనిపించారు. ఈ సినిమాకు సుజోష్ ఘోష్ దర్శకత్వం వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com