Tamannaah : అనుష్క తప్పుకుంది .. తమన్నా వస్తోంది

స్వీటీ బ్యూటీ అనుష్క తప్పుకుంది.. ఆ డేట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా వస్తోంది. యస్.. తమన్నా ప్రధాన పాత్రలో అశోక్ తేజ తెరకెక్కిస్తోన్న సినిమా ఓదెల 2. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు డైరెక్షన్ సూపర్ విజన్ చేస్తున్నాడు సంపత్ నంది. డి మధు నిర్మాత. తమన్నా లేడీ అఘోరీగా కనిపించబోతోన్న ఈ మూవీ టీజర్ తర్వాత భారీ హైప్ వచ్చింది. ఆ టీజర్ ను రీసెంట్ గా కుంభమేళాలో విడుదల చేయడంతో జాతీయ స్థాయిలో ఈ సినిమాకు ఓ హైప్ వచ్చిందనే చెప్పాలి. టీజర్ మైండ్ బ్లోయింగ్ గా ఉందనే టాక్ వచ్చింది.
తమన్నాతో పాటు ఫస్ట్ పార్ట్ లో ఉన్న హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా మరోసారి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాంతార, విరూపాక్ష, మంగళవారం మూవీస్ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఎలా చూసినా కమర్షియల్ గా బాగా వర్కవుట్ అయ్యే మూవీలా కనిపిస్తోందనే టాక్ ఇండస్ట్రీలోనూ ఉంది. అందుకే బిజినెస్ పరంగా అదరగొడుతోందీ మూవీ. కేవలం తమన్నా మాత్రమే మెయిన్ ఎసెట్ గా ఉన్న ఓదెల 2 బిజినెస్ చూస్తుంటే ఓ మీడియం రేంజ్ హీరో సినిమా స్థాయిలో కనిపిస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేయబతోన్నట్టు ప్రకటించారు. నిజానికి ఆ డేట్ లో గతంలోనే అనుష్క, క్రిష్ కాంబోలో వస్తోన్న ఘాటీ చిత్రాన్ని విడుదల చేస్తాం అని ప్రకటించారు. బట్ ఆ మూవీ పోస్ట్ పోన్ అయింది. దీంతో ఓదెలను ఏప్రిల్ 17న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సో.. ఈ మూవీ హిట్ అయితే తమన్నా కెరీర్ మరో టర్న్ తీసుకుంటుందని చెప్పొచ్చేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com