Tamannaah Break up : లవర్ తో విడిపోయిన తమన్నా

Tamannaah Break up :  లవర్ తో విడిపోయిన తమన్నా
X

మిల్కీ బ్యూటీ తమన్నా రెండు రోజులుగా నాన్ స్టాప్ న్యూస్ లో ఉంటోంది. అందుకు కారణం తను తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో విడిపోవడమే. ఇన్నాళ్ల కెరీర్ లో తమన్నాపై ఎప్పుడూ పెద్దగా రూమర్స్ రాలేదు. అంటే ఫలానా వారితో ఎఫైర్ ఉందని.. ఫలానా మనిషితో సీక్రెట్ రిలేషన్ మెయిన్టేన్ చేస్తుందని.. ఈ తరహా న్యూస్ లేవు.రెండేళ్ల క్రితం అనూహ్యంగా తనే విజయ్ వర్మను ప్రేమిస్తున్నానని.. తనన సంతోష పెట్టడం అతనికి బాగా తెలుసు అని చెప్పడమే కాదు.. అతనో ట్రూ జెంటిల్మన్ అని తెగ పొగిడేసింది. అప్పటి నుంచి ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా చెట్టా పట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు.

మరి సడెన్ గా ఏమైందో కానీ ఇప్పుడు ఆ ఇద్దరూ విడిపోయారట.ఇద్దరూ తమ ఫోటోస్ ను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి డిలీట్ చేసుకున్నారు. ఇవాళా రేపు.. రిలేషన్స్ విడిపోతున్నాయి అంటే ఓపెన్ గా చెప్పాల్సిన పని కూడా లేదు. ఇలా ఫోటోస్ డిలీట్ చేసుకుంటే చాలు. వాళ్లు విడిపోయారని మనమే అనుకుంటాం.

ఇక విశేషం ఏంటంటే.. పెళ్లై విడాకులు తీసుకున్న సినిమా సెలబ్రిటీలు ఒక మాట చెబుతుంటారు కదా..విడిపోయినా మేం ఫ్రెండ్స్ గానే ఉంటాం. మా మధ్య ఎలాంటి శతృత్వం లేదు.. అంటూ కబుర్లు చెబుతుంటారు. ఆ కబుర్లు ఈ కపుల్ కూడా చెప్పారట. ఏదేమైనా ఇప్పటి వరకైతే తమన్నా కానీ విజయ్ కానీ తమ బ్రేకప్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. జస్ట్ ఫోటోస్ డిలీట్ చేసుకున్నారంతే.

Tags

Next Story