సినిమా

Tamannaah: మెగా హీరోకు ఛాలెంజ్ విసిరిన తమన్నా..

Tamannaah: బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న గని సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు.

Tamannaah: మెగా హీరోకు ఛాలెంజ్ విసిరిన తమన్నా..
X

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా.. హీరోయిన్లలోనే ఓ సెపరేట్ ట్రెండ్‌ను సృష్టించింది. ఓ పక్క హీరోయిన్‌గా చేస్తూనే మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో తన స్టెప్పులతో మ్యాజిక్ చేయడం మొదలుపెట్టింది. తమన్నా తర్వాత చాలామంది హీరోయిన్లు ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. ఇటీవల సమంత కూడా పుష్పలో ఐటెమ్ సాంగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తమన్నా ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'గని' చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసింది.

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఎఫ్ 2' సినిమాలో వరుణ్‌కు వదినగా నటించింది తమన్నా. ఇక ఇప్పుడు తాను హీరోగా వస్తున్న 'గని' చిత్రంలో వరుణ్‌తో ఐటెమ్ గర్ల్‌గా స్టెప్పులేయనుంది మిల్కీ బ్యూటీ. ఈ పాట ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఇందులో తమన్నా డ్యాన్స్‌తో ప్రేక్షకులను మరోసారి ఫిదా చేస్తోంది.


బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న గని సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు మేకింగ్ వీడియోలతో పాటు ఓ టీజర్ కూడా విడుదలయ్యింది. ఇందులో వరుణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సయ్యీ మంజ్రేకర్ నటిస్తోంది. అయితే గని నుండి విడుదలయిన 'కోడ్తా' పాట మంచి రెస్పాన్స్ అందుకుంటూ ఉండడంతో తమన్నా ఓ కొత్త ఛాలెంజ్‌తో సోషల్ మీడియాను షేక్ చేయడానికి సిద్ధమయ్యింది.

డ్యాన్స్ విషయంలో తమన్నా తనకు తానే సాటి అనిపించుకంటూ ఉంటుంది. కోడ్తా పాటలో కూడా అంతే. అయితే ఆ పాటలో తాను వేసిన స్టెప్పులను ట్రై చేయమని వరుణ్ తేజ్‌తో పాటు హీరోయిన్ మంజ్రేకర్‌కు కూడా ఛాలెంజ్ విసిరింది తమన్నా. 'ఎన్ని ఛాన్సులు కావాలన్నా తీసుకోండి. ఎన్నిసార్లు కావాలన్నా డ్యాన్స్ చేయండి. నేను కోడితే పాటకు డ్యాన్స్ చేస్తున్నా. తరువాత మీ టర్న్' అంటూ వారిని ఈ ఛాలెంజ్‌లో యాడ్ చేసింది మిల్కీ బ్యూటీ.


Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES