Tamannaah : తమన్నా డ్యాన్స్ ఏమన్నా ఉందా!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ను మిల్కీ బ్యూటీ తమన్నా కల్గి ఉంది. పాల లాంటి తెలుపుతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ఈ పంజాబీ ముద్దు గుమ్మ. వానా వానా వెల్లువాయే పాటలో రామ్ చరణ్ తో కలిసి చేసిన డ్యాన్స్ కుర్రకారు మతులను పోగొట్టింది. బాహుబలి సినిమాతో తనలోని నటనతో ఫ్యాన్స్ను అలరించింది. ఇక బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించడంతో ఈ మిల్క్ బ్యూటీ అభిమానులు ఢీలా పడ్డారు. తాజాగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన సత్తా చాటుతోంది ఈ మిల్క్ బ్యూటీ. బాలీవుడ్ మూవీ 'స్త్రీ -2' సినిమాలో ఓ పాట కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ డ్యాన్సింగ్ క్వీన్ తన అందచందాలను ఆరబోస్తూ తమన్నా చేసిన హాట్ డ్యాన్స్ కి యూత్ అట్రాక్ట్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. జైలర్ సినిమాలో నుప్ కావాలయ్యా అంటూ డ్యాన్స్ చేసిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ మరోమారు అదేస్థాయిలో రెచ్చిపోయిందని అభిమానులు అంటున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com