Babli Bouncer : మాస్ లుక్‌లో తమన్నా.. బబ్లీ బౌన్సర్ ట్రైలర్ అదిరింది..

Babli Bouncer : తమన్నా భాటియా బౌన్స్‌ర్‌గా కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ 'గంగతో రాంబాబు' సినిమాలో తమన్నా మగాడిలా కనిపిస్తుంది. అదే బాడీ ల్యాంగ్వేజ్‌తో ఇప్పుడు 'బబ్లీ బౌన్సర్' సినిమాటో బౌన్సర్ పాత్రలో నటించింది తమన్నా. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. మధుర్ భండార్కర్ దీనికి దర్శకత్వం వహించారు. దేశంలో 'ఫతేపూర్ బేరి' ఊరు బౌన్సర్లకు పెట్టింది పేరు. అలాంటి ఊరు నుంచి వచ్చిన తమన్నా తన కాళ్ల మీద తాను నిలబడ్డానికి బౌన్సర్‌గా మారుతుంది.
ఇందులో ఆమె పదవ తరగతి కూడా పాస్ కాని అమ్మాయిలా కనిపిస్తుంది. తమన్నా క్యారెక్టర్ ఇప్పుడు వచ్చిన అన్ని సినిమాల్లోకి చాలా భిన్నంగా ఉంటుంది. మేకర్స్ ఈ 'బబ్లీ బౌన్సర్' చిత్రాన్ని నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 23న హాట్‌స్టార్‌లో హిందీ, తెలుగు తమిళ్ భాషల్లో స్ట్రీమ్ కానుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com