ఆంటీ అలా ఎందుకు చేసింది.. ఏడ్చిన దర్శకుడి కూతురు

గ్లామర్ డాల్, మిల్కీ బ్యూటీ అలా గన్ గురిపెడితే ఎలా.. అసలే ఆమెకి పెద్ద ఫ్యాన్ దర్శకుడి గాంధీ చిన్న కూతురు లిపి. మాస్ట్రో సినిమాలో తమన్నా నటన చూసి భయపడిపోయింది. వరుస హత్యలు చేస్తున్న ఆమెను చూసి కన్నీరు పెట్టుకుంది. హీరో నితిన్‌ని సైతం ఇబ్బంది పెడుతుంది తమన్నా ఈ సినిమాలో. దీంతో తమన్నాని ఇంత వైల్డ్‌గా ఏ సినిమాలో చూడలేదేమో.. కన్నీరు కారుస్తున్న చిన్నారిని తండ్రి సముదాయిస్తున్నట్టున్నారు.
చిన్నారి ఏడుపు చిత్రంగా అనిపించింది ఇంట్లో వాళ్లకి.. వీడియో తీసి నితిన్‌కి షేర్ చేశారు. నితిన్ తన ట్విట్టర్‌లో వీడియోని షేర్ చేస్తూ.. వాట్ యార్, నీ అభిమానిని ఏడిపించావ్.. ఈ రోజు నేను చూసిన క్యూట్ వీడియో ఇది.. తమన్నాని ఉద్దేశిస్తూ పోస్ట్ చేశాడు .
ఈ వీడియోపై స్పందించిన తమన్నా.. చిన్నారికి తప్పకుండా హగ్ ఇవ్వాల్సిందే అని తెలిపింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన మాస్ట్రో చిత్రంలో నితిన్, తమన్నాల నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అంధదూన్'కు తెలుగు రీమేక్ 'మాస్ట్రో' అనే విషయం తెలిసిందే.
Omg can't wait to give this cutie a hug 🤣🤣🙈🙈🤗🤗🤗 https://t.co/BLz6Qk5R0q
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 17, 2021
గ్లామర్ డాల్, మిల్కీ బ్యూటీ అలా గన్ గురిపెడితే ఎలా.. అసలే ఆమెకి పెద్ద ఫ్యాన్ దర్శకుడి గాంధీ చిన్న కూతురు లిపి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com