నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు 'విజయకాంత్' ఇక లేరు..

తమిళ నటుడు-రాజకీయ నాయకుడు విజయకాంత్ (71) చెన్నై ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన చివరకు ఈ రోజు తుది శ్వాస విడిచారు.
మాజీ తమిళ నటుడు మరియు DMDK నాయకుడు, తన అభిమానులచే 'కెప్టెన్'గా ఆరాధించబడే విజయకాంత్, డిసెంబరు 28 న చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 71 ఏళ్ళ వయసులో మరణించారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నందున వెంటిలేటర్‌పై ఉన్నారు.
విజయ్ కాంత్ కోవిడ్-19తో బాధపడుతున్నాడని పార్టీ వర్గాలు ప్రకటించినప్పటికీ, అతను న్యుమోనియాతో బాధపడుతున్నాడని చెన్నైలోని MIOT హాస్పిటల్ ప్రకటించింది. నవంబర్ నుండి ఆయన తమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. దగ్గు మరియు గొంతు నొప్పితో బాధపడుతున్న విజయ్ ని వైద్యులు 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచారు.
విజయకాంత్ తమిళనాడు శాసనసభకు రెండుసార్లు సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు భార్య ప్రేమలత, కుమారులు షణ్ముఖ పాండియన్, విజయప్రభాకరన్ ఉన్నారు. విజయ్ ఆగష్టు 25, 1952 న మధురైలో జన్మించారు. అతని అసలు పేరు విజయరాజ్ అళగర్స్వామి.
గత నాలుగైదు సంవత్సరాలుగా రాజకీయాల్లో యాక్టివ్ పార్ట్ లేరు. దాంతో విజయకాంత్ స్థానంలో అతని భార్య ప్రేమలతను డిఎండికె ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com