తమిళ నటుడు విజయకాంత్ కు మరణానంతరం పద్మభూషణ్

తమిళ నటుడు విజయకాంత్ కు మరణానంతరం పద్మభూషణ్

కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (Padma Award) ప్రకటించింది. ఈసారి సినీ పరిశ్రమ నుంచి చాలా మంది అవార్డులు అందుకుంటున్నారు. మెగా స్టార్ చిరంజీవితో (Chiranjeevi) పాటు సీనియర్ నటి వైజయంతి మాల పద్మవిభూషణ్ అవార్డులను కైవసం చేసుకున్నారు. అలాగే బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతప్, సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. వీరితో పాటు విజయ్ కాంత్ కు కేంద్రం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. విజయ్ కాంత్ మరణానంతరం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.

గతేడాది డిసెంబర్ 28న విజయ్ కాంత్ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చాలా కాలంగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయ్ కాంత్ (Vijaya Kanth) చెన్నైలో తుది శ్వాస విడిచారు. సినిమా రంగంలో విజయ్ కాంత్ చేసిన సేవలకు గాను కేంద్రం ఆయనకు మరణానంతరం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. విజయ్ కాంత్‌కు పద్మభూషణ్ అవార్డు రావడంపై కోలీవుడ్ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. విజయ్‌కాంత్‌కి ఇది గొప్ప నివాళి అని అన్నారు.

మరణానంతరం పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీరే..

విజయ్ కాంత్ లాగే గతంలో కొందరు సినీ ప్రముఖులు మరణానంతరం పద్మ అవార్డులు అందుకున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2021లో పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.బాలు మరణించిన ఏడాది తర్వాత కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

వాణి జయరామ్...

ప్రముఖ గాయని వాణీ జయరామ్ 2023లో పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమెకు అవార్డు ప్రకటించిన పది రోజుల తర్వాత అనుమానాస్పదంగా మరణించారు. రాజకీయాల్లో, ములాయం సింగ్ యాదవ్ ,ఇతరులు మరణానంతరం పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.

విజయ్ కాంత్ తన 40 ఏళ్ల కెరీర్‌లో 200కి పైగా సినిమాలు చేశాడు. విజయ్ కాంత్ తమిళ చిత్రాలను చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలు తెలుగులోకి తీసుకువచ్చారు. అంతే కాకుండా విజయ్ కాంత్ నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయి ప్రేక్షకులను అలరించాయి. విజయ్ కాంత్ డబ్బింగ్ సినిమాల్లో సింధూరపువ్వు, కెప్టెన్ ప్రభాకర్ డైరెక్ట్ తెలుగు సినిమాల కంటే ఎక్కువ వసూళ్లతో రికార్డులు సృష్టించాయి.

Tags

Read MoreRead Less
Next Story