Dhanush : తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం

అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్స్ పూర్తి చేయని నటీనటులపై తమిళ సినీ నిర్మాతల మండలి కొరడా ఝళిపించింది. అడ్వాన్స్‌లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని ధనుష్ పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అనుమతులు ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్స్‌ను నిర్మాతల మండలి నిలిపేయాలని నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్స్ చేసుకునే అవకాశం కల్పించాలని మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న సినిమాలు, ఇచ్చిన అడ్వాన్స్‌లపై నిర్మాతలను మండలి నివేదిక అడిగింది. ఇకపై సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్షీట్లు ఇచ్చేలా నిర్మాతల మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఏ హీరోహీరోయిన్ కూడా ఇకపై అడ్వాన్స్‌లు తీసుకోవడం నిషేధం విధించినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com