Vijay-Ajith: ప్లీజ్ ప్రమోషన్స్‌కి రారూ.. స్టార్ హీరోలను బతిమాలుతున్న నిర్మాతలు..

Vijay-Ajith: ప్లీజ్ ప్రమోషన్స్‌కి రారూ.. స్టార్ హీరోలను బతిమాలుతున్న నిర్మాతలు..
X
Vijay-Ajith: ఇప్పుడు సినిమాకు లాంగ్వేజ్ బారియర్స్ లేవు. ఎవరు ఏ భాషలో అయినా నటించొచ్చు. అయితే ప్రమోషన్స్ మాత్రం క్రేజీగా ఉండాలి.

Vijay-Ajith: ఇప్పుడు సినిమాకు లాంగ్వేజ్ బారియర్స్ లేవు. ఎవరు ఏ భాషలో అయినా నటించొచ్చు. అయితే ప్రమోషన్స్ మాత్రం క్రేజీగా ఉండాలి. లేదంటే నిర్మాతలు మునిగిపోతారు. బట్ ఈ విషయంలో తమిళ్ హీరోలు కాస్త తేడాగా ఉంటారు. తామేదో ప్రమోషన్స్ కు అతీతం అని భావిస్తారు. పైగా తాము ప్రమోట్ చేయకున్నా రికార్డులు క్రియేట్ చేస్తాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు.


ఆ రికార్డులు పిఆర్ టీమ్ లు క్రియేట్ చేస్తాయని ఇప్పుడు అందరికీ తెలుసు. అయినా వాళ్లు మారరు. అది సరే ఇప్పుడు వాళ్ల గురించి మనకెందుకూ అంటారా.. ఎందుకేంటీ.. అక్కడి ఇద్దరు టాప్ హీరోల సినిమాలు తెలుగులో విడుదల కాబోతున్నాయి. కానీ వీళ్లు ప్రమోషన్స్ కు ఒప్పుకోవడం లేదు. దీంతో నిర్మాతలు కాళ్లా వేళ్లా పడుతున్నారట. మరి ఆ స్టార్స్ ఎవరో గెస్ చేశారు కదా..?


విజయ్, అజిత్.. తమిళ్ లో టాప్ స్టార్స్ గా వెలుగుతున్న హీరోలు. ఒకప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉన్నారీ ఇద్దరు హీరోలు. మరి టాలెంట్ విషయంలో కూడానా అంటే చెప్పలేమనుకోండి. అయితే వాళ్లిద్దరికీ కోలీవుడ్ లో తిరుగులేని స్టార్డమ్ ఉంది. అందుకే వీరి సినిమాలు విడుదలవుతున్నాయంటే ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ ఉంటుంది. అలాంటిది ఇద్దరి సినిమాలూ చాలాయేళ్ల తర్వాత సంక్రాంతికి వస్తున్నాయి.



అక్కడ గోల ఎలా ఉన్నా.. ఇక్కడ కూడా అదే టైమ్ కు వస్తున్నాయి. ఇటు చూస్తే ఇక్కడ మన లెజెండ్స్ చిరంజీవి, బాలకృష్ణల సినిమాలున్నాయి. మరి వీరిని తట్టుకుని నిలబడాలంటే తెలుగులో తమిళ్ హీరోలు ప్రమోషన్స్ చేయాలి. ఇంతకు ముందు వీరి సినిమాలు ఇక్కడ విడుదలైనప్పుడు కూడా ప్రమోషన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ వేరే. ఎందుకంటే విజయ్ వారసుడు చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు.. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు.



అటు అజిత్ సినిమా చిత్రాన్ని డైరెక్ట్ గా డబ్ చేస్తున్నారు. తమిళ్ లో విజయ్ అయినా.. అప్పుడప్పుడూ ప్రమోషన్స్ కు వస్తాడు కానీ.. అజిత్ అస్సలే పట్టించుకోడు. సినిమా అయిన తర్వాత ఇక దానితో తనకేం సంబంధం లేదు అన్నట్టుగానే ఉంటాడు. మరి ఇదేం పద్ధతో కానీ.. నిర్మాతల బాధ వీరికి అసలు పట్టదు. ఇక దిల్ రాజు తెలుగులో బలమైన నిర్మాత కాబట్టి.. ఈసారి థియేటర్స్ కూడా బానే ఉంటాయి. ఆ మేరకు అతను రాబట్టుకోవాలంటే ఆడియన్స్ రావాలి.


వాళ్లు రావాలంటే విజయ్ ప్రమోషన్స్ కు రావాలి. కానీ అతను నో అంటున్నాడట. దీంతో దిల్ రాజు విజయ్ ని బ్రతిమాలుకుంటున్నాడని టాక్. ఈ ఒక్కసారికీ వచ్చి.. ఇంటర్వ్యూస్ ఇవ్వమని రిక్వెస్టింగ్ చేస్తున్నాడట. అటు అజిత్ అయితే ఇంక చెప్పేదేముందీ.. అక్కడే పట్టించుకోడు. ఇక ఇక్కడికి వస్తాడా..? పైగా ఈయనకు రికార్డులంటే చిరాకు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే చెప్పుకుంటారు. ఇప్పుడు ఇద్దరు టాప్ స్టార్స్ బాక్సాఫీస్ వార్ లో తలపడుతున్నారు కాబట్టి అభిమానులు కూడా ప్రమోషన్స్ చేస్తే బావుంటుందనుకుంటున్నారు. మరి తెలుగులో ఈ తమిళోల్ల ఓపెనింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

బాబూరావు. కె

Tags

Next Story