సినిమా

D Imman : విడాకులు ప్రకటించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!

D Imman : తమ పదమూడేళ్ళ వివాహబంధానికి స్వస్తి పలికారు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ దంపతులు.. తన భార్యతో విడిపోతున్నట్లుగా ఇమ్మాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

D Imman : విడాకులు ప్రకటించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!
X

D Imman : తమ పదమూడేళ్ళ వివాహబంధానికి స్వస్తి పలికారు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ దంపతులు.. తన భార్యతో విడిపోతున్నట్లుగా ఇమ్మాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వాస్తవానికి వీరిద్దరూ 2020లోనే విడాకులు తీసుకున్నారు కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఏడాది తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. దీనితో వీరి 13 ఏళ్ల బంధానికి తెరపడింది. అయితే ఎందుకు విడిపోతున్నారో అన్నది మాత్రం ఇమ్మాన్ వెల్లడించలేదు.

"నా శ్రేయోభిలాషులు మరియు సంగీత ప్రియులందరికీ నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను . జీవితం మనల్ని విభిన్నంగా తీసుకువెళుతుంది. మోనికా రిచర్డ్ మరియు నేను నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాము ఇకపై భార్యాభర్తలు కాదు. మా శ్రేయోభిలాషులు, సంగీత ప్రియులు మరియు మీడియా అందరినీ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను ముందుకు. మీ ప్రేమ, మద్దతు కోసం చాలా ధన్యవాదాలు" అని పోస్ట్ చేశాడు.

కాగా కోలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఇమ్మాన్ ఒకరు.. 2002లో ప్రియాంక చోప్రా, విజయ్‌ జంటగా నటించిన తమిజన్‌ చిత్రంతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు.. ఇటీవల రజనీకాంత్‌ హీరోగా నటించిన అన్నాత్తే(తెలుగులో పెద్దన్న) సినిమాకు సంగీతం అందించాడు. అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం సినిమాకి గాను నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇక 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాని వివాహం చేసుకున్నాడు ఇమ్మాన్... వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్.Next Story

RELATED STORIES