Ravindar- Mahalakshmi : ప్రియమైన భార్యకు ప్రేమతో 'ఒకటిన్నర కిలోల బంగారు' ఆభరణాలు..

Ravindar- Mahalakshmi : ప్రియమైన భార్యకు ప్రేమతో ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలు..
Ravindar- Mahalakshmi : అందం, ఆకర్షణ ఇవేవీ అడ్డు రాలేదు వారి ప్రేమకి. రవీందర్‌ను ప్రేమించానని అతడినే పెళ్లి చేసుకుంటానని పెద్దలకు చెబితే నీకేమైనా మతి పోయిందా..

Ravindar- Mahalakshmi : అందం, ఆకర్షణ ఇవేవీ అడ్డు రాలేదు వారి ప్రేమకి. రవీందర్‌ను ప్రేమించానని అతడినే పెళ్లి చేసుకుంటానని పెద్దలకు చెబితే నీకేమైనా మతి పోయిందా.. ఆ భారీ వ్యక్తితో పెళ్లేంటని మండిపడ్డారు. కానీ అతనిలాగే అతని మనసుకూడా విశాలమైందని మహాలక్ష్మి మనువాడింది. ఎవరేమనుకున్నా పట్టించుకోలేదు.

ఈ వింత జంట వార్తల్లో నిలిచింది. ఓ వారం రోజులు కెమెరా ఫోకస్ వాళ్లమీదే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ జంటకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. బంగారం లాంటి మనసున్న భార్యకు ఎంత బంగారం పెట్టినా తక్కువే అయినా భార్యను సంతృప్తి పరచాలంటే బంగారు ఆభరణాలే సరైనవనుకున్నాడేమో పెళ్లి రోజు చాలా నగలు చేయించినట్లు సమాచారం.

ఈ నెల ప్రారంభంలో, ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకోవడం అత్యంత చర్చనీయాంశమైన అంశం. నయనతార, విఘ్నేష్ శివన్ వివాహం తర్వాత, వీరి వివాహం గురించే పరిశ్రమలో అందరూ మాట్లాడుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటను చాలా మంది అభినందిస్తే, కొందరు రవీందర్‌కు మహాలక్ష్మికి వయస్సు తేడా ఉందని, వారు ఆదర్శ జంటగా కనిపించడం లేదని ట్రోల్ చేశారు.

సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మహాలక్ష్మి తన భర్తను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్‌ చేస్తున్న వారిపై మండిపడింది. పెళ్లి తర్వాత మహాలక్ష్మి, రవీందర్ వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, ట్రోలింగ్ గురించి మాట్లాడటానికి వివిధ యూట్యూబ్ ఛానెల్‌లలో ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపించారు.


వీరి పెళ్లికి సంబంధించిన చర్చలు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, తాజాగా పెళ్లికి సంబంధించిన కొత్త వార్తలు మరోసారి జనాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. పెళ్లి రోజు మహాలక్ష్మికి రవీందర్ కానుకలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రవీందర్ పెళ్లి రోజు తన భార్యకు విలాసవంతమైన బహుమతులను ఇచ్చినట్లు సమాచారం.

వారి పెళ్లికి రవీందర్ మహాలక్ష్మికి బంగారు పూత పూసిన మంచాన్ని బహుమతిగా ఇచ్చాడని సమాచారం. అంతే కాదు నిర్మాత తన భార్యకు ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చారట. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు.

మహాలక్ష్మి వాణి రాణి, ఆఫీస్, చెల్లమాయ్, ఉతిరిపూక్కల్ మరియు ఒరు కై ఒసై వంటి టెలివిజన్ ధారావాహికలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన నటి. మహాలక్ష్మి గతంలో అనిల్‌ను వివాహం చేసుకుంది, వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఆ వివాహ బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. 2019లో ఇద్దరూ విడిపోయారు. రవీందర్‌కు కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story