Kollywood: ఇంటర్వ్యూలకు నో చెప్తున్న స్టార్ హీరోలు..

Kollywood: ఇంటర్వ్యూలకు నో చెప్తున్న స్టార్ హీరోలు..
Kollywood: ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిని దానికి తగిన ప్రచారం కల్పించకపోతే అది జనంలోకి వెళ్లదని సినిమా ఇండస్ట్రీ గట్టిగా నమ్ముతుంది.

Kollywood: ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిని దానికి తగిన ప్రచారం కల్పించకపోతే అది జనంలోకి వెళ్లదని సినిమా ఇండస్ట్రీ గట్టిగా నమ్ముతుంది. అందుకే ప్రచారానికి పెద్ద పీట వేస్తుంది ఏ ఇండస్ట్రీ అయినా. కానీ తమిళ స్టార్స్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉంటారు. వాళ్లకి పబ్లిసిటీ నచ్చదు. కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేదని బలంగా నమ్ముతారు. ఆ విధంగానే వారి సినిమాలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రచార మాధ్యమాలు ఎక్కువయ్యాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందాన, ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే అంత త్వరగా పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవచ్చు.

విజయ్, అజిత్, ధనుష్: నటులు మరియు వారి 'నో ఇంటర్వ్యూ' విధానం.. ఈ మధ్య కాలంలో వారి పంథాని కొంచెం మార్చుకుంటున్నారు హీరోలు.. విజయ్, ధనుష్ వంటి నటులు అభిమానులను వ్యక్తిగతంగా కలుసుకుంటున్నారు, ఆడియో లాంచ్ ఈవెంట్‌లకు హాజరవుతున్నారు. కానీ అజిత్ అందుకు మినహాయింపు. అయితే, ఈ ముగ్గురు నటులు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు. కోలీవుడ్‌లో వీరికి అభిమాన గళం బాగానే ఉంది.

సినిమా విడుదలైన మొదటి-రోజు ఫస్ట్-షోలో క్రాకర్స్ పేల్చడం నుండి మొదలు, ట్విట్టర్‌లో ప్రతి విషయాన్ని పోస్ట్ చేయడం, తమ స్టార్‌లను హైప్ చేసే విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదన్నట్లు ఉంటారు అభిమానులు. ఈ రోజుల్లో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలంటే ప్రమోషన్లు తప్పనిసరి అయిపోయాయి. ఉదాహరణకు విక్రమ్‌ సినిమా విషయానికి వస్తే.. కమల్ హాసన్ ప్రమోషన్స్ ప్రాముఖ్యతను తెలుసుకుని సినిమా విడుదలయ్యే లోపు ఖాళీ లేకుండా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ విజయ్, అజిత్, ధనుష్‌లు మాత్రం నో ఇంటర్వ్యూ విధానాన్ని అనుసరిస్తున్నారు.

ధనుష్

నెట్‌ఫ్లిక్స్ యొక్క ది గ్రే మ్యాన్ కోసం, ధనుష్ భారతదేశంలోని మీడియా ఛానెల్‌లతో బ్యాక్-టు-బ్యాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. నో-ఇంటర్వ్యూ విధానంతో ధనుష్ నటీనటుల జాబితాలోకి లేటెస్ట్ ఎంట్రీ అయినట్లు కనిపిస్తోంది.

విజయ్

తన అభిమానులు ముద్దుగా తలపతి అని పిలుచుకునే విజయ్, దశాబ్దానికి పైగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. కాకపోతే విజయ్ తరచూ తన అభిమానులను సమావేశాల్లో కలుసుకోవడంతోపాటు తన సినిమాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటాడు.

అజిత్

దశాబ్ద కాలంగా అజిత్ కుమార్ మీడియా కంటికి దూరంగా ఉంటున్నారు. తన వ్యాఖ్యలు బయటకు పొక్కుతున్నాయని, అందుకే మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మంచి సినిమా అంటే తనకే ప్రమోషన్ అని అజిత్ తరచుగా చెబుతుంటారు. అతను ఒక చిత్రానికి సంతకం చేసినప్పుడు అది కూడా ఒప్పందంలో ఒక భాగం.

Tags

Read MoreRead Less
Next Story