తమిళ్ తలపతి తెలుగు డైరెక్టర్ తో..

ఇటీవలే మాస్టర్‌తో బ్లాక్ బస్టర్ సాధించిన తలపతి విజయ్ త్వరలో టాలీవుడ్ దర్శకుడు మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లితో కలిసి ఓ సినిమా చేయనున్నారు. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.
విజయ్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోకి డబ్ అయి మంచి పేరు తెచ్చుకున్నాయి. తెలుగులో కూడా ఆయనకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు.
విజయ్ తో వంశీ పైడిపల్లికి ఇది రెండవ చిత్రం. అంతకుముందు, అతను నాగార్జున అక్కినేని, కార్తీతో కలిసి నటించిన తోజా (తెలుగులో ఊపిరి) చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ్ ఇటీవల జార్జియాలో తలపతి 65 చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకురాలిగా నటించారు. లోకేష్ కనకరాజ్‌తో విజయ్ మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com