Tamilnadu : నటుడు అజిత్ తండ్రి కన్నుమూత

Tamilnadu : నటుడు అజిత్ తండ్రి కన్నుమూత
X

కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్​ తండ్రి సుబ్రమణియన్ మణి ( పీఎస్ మణి ) తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలో శుక్రవారం ప్రాణాలు వదిలారు. చాలాకాలంగా పక్షవాతంతో పాటు వృద్ధాప్యపు సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అజిత్ తండ్రి మరణ వార్త తెలిసిన ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపుతున్నారు. చెన్నైలోని బెసెంట్ నెగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదనపు భద్రత కోసం ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. పీఎస్ మణి కేరళలోని పాలక్కాడ్ కు చెందినవారు. అతనికి భార్య మోహిని, ముగ్గురు పిల్లలు అరుప్ కుమార్, అజిత్ కుమార్, అనిల్ కుమార్ ఉన్నారు.

Next Story