Vikram : తంగలాన్.. ఇది సరిపోతుందా..

Vikram : తంగలాన్.. ఇది సరిపోతుందా..
X

కబాలి టీజర్ తోనే కంట్రీ మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు దర్శకుడు పా. రంజిత్. కానీ సినిమా ఆ స్థాయిలో మెప్పించలేదు. అయినా రజినీకాంత్ తోనే మరోసారి కాలా మూవీ చేశాడు. ఒక పర్టిక్యులర్ ఐడియాలజీతో కనిపిస్తూనే కమర్షియల్ వాల్యూస్ నిండి ఉన్న మూవీస్ చేయడం రంజిత్ శైలి. సార్పట్టై పరంపర అనే మూవీ భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారంటే కారణం అతని టేకింగ్ అండ్ మేకింగ్ లో ఉండే స్పెషాలిటీయే. మధ్యలో మరో యూత్ ఫుల్ మూవీతో కోలీవుడ్ కమర్షియల్ హిట్ కొట్టిన రంజిత్.. ఇప్పుడు అక్కడి టాప్ హీరోస్ లో ఒకడైన విక్రమ్ తో తంగలాన్ అనే మూవీ చేశాడు. ప్రీ ఇండిపెండెన్స్ స్టోరీగా కోలార్ గోల్డ్ ఫీల్డ్( కేజీఎఫ్) నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ తో ఆకట్టుకున్నారు. కేజీఎఫ్ అనగానే ప్రశాంత్ నీల్, యశ్ మూవీ గుర్తొస్తుంది. కానీ ఇది అందుకు పూర్తి భిన్నమైన కోణంలో చెప్పిన కథ అని పా రంజిత్ చెప్పాడు. అటు విక్రమ్ కూడా ఈ మూవీ గురించి ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్నాడు. విక్రమ్ తో పాటు పార్వతి, మాళవిక మోహనన్, పశుపతి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి జివి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం మరో హైలెట్ అంటున్నారు.

అయితే తెలుగులో ఈ తరహా సినిమాలకు పెద్దగా ఆదరణ కనిపించదు. అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కు కనిపించే ఇంట్రెస్ట్ ఐడియలాజికల్ మూవీస్ కు కనిపించదు. పైగా ఇక్కడి రివ్యూవర్స్ కు కూడా ఆ తరహా నేపథ్యం కనిపించదు. అందుకే తంగలాన్ కు సంబంధించి ఓపెనింగ్స్ రావడానికి వీళ్లు చేసిన కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్.. నెక్ట్స్ డే ప్రెస్ మీట్ మాత్రమే సరిపోదు. ఇంకాస్త ప్రమోషన్ పెంచాలి. విక్రమ్, రంజిత్ లాంటి వారితో అయినా మూవీ గురించిన డిస్కషన్స్ ఉండాలి. అప్పుడే అంచనాలు పెరుగుతాయి. లేదంటే తెలుగులో తంగలాన్ కు సమస్య తప్పదు. పైగా అదే రోజు ఊరమాస్ మూవీస్ లాగా కనిపిస్తోన్న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి మూవీస్ ఉన్నాయి. అలాంటి మూవీస్ తో ఓ బలమైన కంటెంట్ ఉన్న సినిమా తెలుగు నుంచి పోటీ పడాలంటే ప్రమోషన్స్ ఇంకా బలంగా ఉండాలి.

Tags

Next Story