Tanushree Dutta : నాకేదయినా అయితే కారణం వారే.. వాళ్ల సినిమాలను బహిష్కరించండి : తనుశ్రీదత్త

X
Tanushree Dutta : తనుశ్రీ దత్తా మరో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తనకు ఏదయినా అయితే వారిదే బాధ్యత అని ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నానాపటేకర్ తనను లైంగికంగా వేధించాడని గతంలో తను శ్రీదత్తా ఆరోపించింది. మీటూ ఉద్యమంలో భాగంగా ఆమె ఈ కామెంట్స్ చేసింది. అయితే ఆ తరువాత తనకు సినిమా అవకాశాలను కావాలనే తగ్గించారని అనేక సార్లు చెప్పింది.
ఇప్పుడు బాలీవుడ్ మాఫియా తనను ఏదైనా చేయొచ్చని.. దానికి కారణం మాత్రం వారే అని చెప్పింది. ఎవరనే విషయం తాను నేరుగా చెప్పనంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పుడు ఎవరి పేర్లు వినిపించాయో వారే తనను చంపడానికి ప్రయత్నిస్తారని చెప్పింది. తనకు ప్రజలపైనే ఎక్కువ నమ్మకం ఉంది అని తనుశ్రీ దత్తా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
